AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: ఒక టీమ్ లో ముగ్గురు స్పిన్నర్లు ఎక్కువ.. ఆ బౌలర్ కి అవకాశమిస్తే బెటర్ అంటున్న టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్..

భారత్ సూపర్ 12లో అక్టోబర్ 23వ తేదీన పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే భారత జట్టులో ముగ్గురు స్పిన్నర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. రవిచంద్ర అశ్విన్, యుజ్వేంద్ర చాహల్,..

T20 World Cup: ఒక టీమ్ లో ముగ్గురు స్పిన్నర్లు ఎక్కువ.. ఆ బౌలర్ కి అవకాశమిస్తే బెటర్ అంటున్న టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్..
Bahrat Arun, Umran Malik (File Photo)
Amarnadh Daneti
|

Updated on: Oct 14, 2022 | 1:50 PM

Share

టీ20 ప్రపంచకప్ కు భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ సూపర్ 12లో అక్టోబర్ 23వ తేదీన పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే భారత జట్టులో ముగ్గురు స్పిన్నర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. రవిచంద్ర అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్పందించారు. ముగ్గురు స్పిన్నర్లు చాలా ఎక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. ముగ్గురు స్పిన్నర్లకు బదులు వారి స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ ను ఎంపిక చేస్తే బాగుండేదన్నారు. టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తుంది, అయితే ఈ ఎంపికపై మాజీ క్రికెటర్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్పందిస్తూ.. ముగ్గురు స్పిన్నర్లు చాలా ఎక్కువ అని అభిప్రాయపడ్డారు, ఎందుకంటే వారిలో ఒకరు మాత్రమే నిర్దిష్ట సమయంలో ప్లేయింగ్ లెవన్ లో ఉంటారని, ముగ్గురు స్పిన్నర్లకు బదులుగా పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లాలని సెలక్టర్లను భరత్ అరుణ్ కోరాడు.

టీమిండియా పేస్ బౌలింగ్ యూనిట్ గురించి భరత్ అరుణ్ మాట్లాడుతూ.. సరైన ఫీల్డ్‌ను అందించినట్లయితే ఉమ్రాన్ మాలిక్ టీ20 ఫార్మట్ లో బాగా రాణించగలడని తెలివపారు. ఆస్ట్రేలియాలో మైదానాలు పెద్దవిగా ఉంటాయని, ఈ క్రమంలో ఫిట్ గా ఉన్న ఉమ్రాన్ మాలిక్ ను ఎంపిక చేస్తే జట్టుకు ప్రయోజనం ఉండేదన్నారు. సరైన ఫీల్డ్‌ను బట్టి IPLలో ఉమ్రాన్ మాలిక్ బాగా బౌలింగ్ చేశాడన్నారు. ఆస్ట్రేలియాలో వికెట్లను పరిగణనలోకి తీసుకుంటే,ఎక్కువ మంది స్పిన్నర్లను జట్టులోకి ఎంపిక చేసినట్లు తాను భావిస్తున్నాని అన్నారు.

ఉమ్రాన్ మాలిక్ లాంటి ఆటగాడు ఎవరైనా టీమ్‌కి గొప్ప ఫిల్ అప్ అని భరత్ అరుణ్ ఓ టీవీ కార్యక్రమంలో చర్చ సందర్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముగ్గరు స్పిన్నర్లకు బదులుగా ఉమ్రాన్‌ మాలిక్ ను టీమ్ లో చేర్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. జస్ప్రీత్ బుమ్రాను టీమ్ ఇండియా కోల్పోవడం భారత పేస్ బౌలింగ్ విభాగాన్ని మరింత బలహీనపరిచిందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..