ప్రతిష్ఠాత్మక ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 రసవత్తరంగా జరుగుతోంది. ఇక తెలుగు అభిమానుల ఫేవరెట్ జట్టు తెలుగు టైటాన్స్ విజయంతో ఈ సీజన్ ను ఆరంభించింది. అక్టోబర్ 18న బెంగుళూరు బుల్స్ తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి శుభారంభం చేసింది. అయితే ఆ తర్వాత వరుసగా రెండు పరాజయాలు ఎదురయ్యాయి. అయతే ఆశావాహ దృక్పథంతో టోర్నీలో ముందుకు సాగుతామంటున్నారు. తెలుగు టైటాన్స్ స్టార్ కమాండర్ పవన్ సెహ్రావత్. కాగా తెలుగు టైటాన్స్ టీమ్ క్రేజ్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ జట్టుకు స్పాన్సర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండడమే దీనికి నిదర్శనం. తెలుగు టైటాన్స్ మొదటి ఎడిషన్ (2014) ఐదుగురు స్పాన్సర్లతో ప్రారంభమైంది. ఇప్పుడు సీజన్ 11లో ఏకంగా 12 మంది తెలుగు టైటాన్స్ టీమ్ కు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా
తెలుగు టైటాన్స్ సీఈఓ త్రినాధ్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం తెలుగు టైటాన్స్ టీమ్ కు స్పాన్సర్లుగా వ్యవహరించేందుకు అగ్రశేణ వ్యాపార సంస్థలు ఆసక్తిని చూపిస్తున్నాయి. ఈ స్పందనను చూసి మేమెంతో సంతోషిస్తున్నాం. దీనిని గౌరవంగా కూడా భావిస్తున్నాం. మా స్పాన్సర్లు చాలా మంది మాకు ప్రతి సంవత్సరం మద్దతునిస్తూనే ఉన్నారు. ఈ కారణంగానే మేమెంతో ఉత్సాహంతో మైదానంలోకి దిగుతున్నాం’ అని చెప్పుకొచ్చారు. ఇక Parksons Cartamundi సంస్థ ఎండీ అండ్ సీఈవో కపిల్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘మేం ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ కోసం తెలుగు టైటాన్స్ తో చేతులు కలపడానికి ఎంతో సంతోషిస్తున్నాం. కబడ్డీ ఆటకు రోజు రోజుకూ జనాదరణ పెరుగుతోంది. మేం భారతదేశమంతటా మా ఉనికిని విస్తరించాలనుకుంటున్నాం. తెలుగు టైటాన్స్ తో చేతులు కలపడం స్వదేశీ క్రీడల పట్ల మా నిబద్ధతకు నిదర్శనం’ అని చెప్పుకొచ్చారు.
Here are a few moments captured from our last match!
#MatchMoments #MatchPhotos #KabaddiTime #Kabaddi #TeluguTitans #TTvJPP #PKLSeason11 #BattleOfBreath #LetsKabaddi #ProKabaddi #PKL11 #ProKabaddiLeague #TeluguTitansTeam #TitansArmy pic.twitter.com/243CVZDeRK— Telugu Titans (@Telugu_Titans) October 23, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..