విలియమ్స్‌కు నోట్‌బుక్ రిటర్న్ గిఫ్ట్.. పగ తీర్చుకున్న విరాట్ కోహ్లీ!

విలియమ్స్‌కు నోట్‌బుక్ రిటర్న్ గిఫ్ట్.. పగ తీర్చుకున్న విరాట్ కోహ్లీ!

దూకుడుతనానికి బ్రాండ్ అంబాసిడర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యర్థి బౌలర్‌పై పగ తీర్చుకున్నాడని చెబితే.. మీరు నమ్ముతారా.? కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే కానీ నమ్మక తప్పదు. నిన్న ఉప్పల్ వేదికగా విండీస్‌తో జరిగిన టీ20లో బౌలర్ కేసరిక్ విలియమ్స్‌పై రెండేళ్ల క్రితం తనకున్న పగను వెరైటీగా తీర్చుకున్నాడు. అదెలా అంటే.. అతని బౌలింగ్‌కి తన బ్యాట్ బాదుడుతోనే సమాధానం ఇచ్చాడు. ప్రత్యర్ధులు తనను ఎంతగా స్లెడ్జింగ్ చేసినా.. అన్నింటికి తన బ్యాట్ సమాధానం చెబుతుందని పలు సందర్భాల్లో […]

Ravi Kiran

|

Dec 07, 2019 | 3:59 PM

దూకుడుతనానికి బ్రాండ్ అంబాసిడర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యర్థి బౌలర్‌పై పగ తీర్చుకున్నాడని చెబితే.. మీరు నమ్ముతారా.? కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే కానీ నమ్మక తప్పదు. నిన్న ఉప్పల్ వేదికగా విండీస్‌తో జరిగిన టీ20లో బౌలర్ కేసరిక్ విలియమ్స్‌పై రెండేళ్ల క్రితం తనకున్న పగను వెరైటీగా తీర్చుకున్నాడు. అదెలా అంటే.. అతని బౌలింగ్‌కి తన బ్యాట్ బాదుడుతోనే సమాధానం ఇచ్చాడు.

ప్రత్యర్ధులు తనను ఎంతగా స్లెడ్జింగ్ చేసినా.. అన్నింటికి తన బ్యాట్ సమాధానం చెబుతుందని పలు సందర్భాల్లో స్పష్టం చేసిన కోహ్లీ.. నిన్న మాత్రం తన ప్రతీకారం తీర్చుకున్నాడని చెప్పాలి. అంతేకాకుండా చేజింగ్‌లో తానే బెస్ట్ అని మరోసారి కోహ్లీ నిరూపించుకున్నాడు. టీమిండియాను గెలిపించడంలో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమైనది. అంతేకాక టీ20ల్లో తన అత్యధిక స్కోర్‌ను కూడా నిన్నటి మ్యాచ్‌లో సాధించాడు.

ఇక అసలు విషయానికి వస్తే.. సరిగ్గా రెండేళ్ల క్రితం జూలై 9 2017 నాడు కింగ్‌స్టన్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 జరిగింది. అందులో కోహ్లీ(39) వ్యక్తిగత పరుగుల వద్ద విలియమ్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌‌కు చేరాడు. ఇక విలియమ్స్.. కోహ్లీని అవుట్ చేసిన ఆనందంలో తన ట్రేడ్ మార్క్ నోట్‌బుక్ గెస్టర్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు అదే విలియమ్స్ బౌలింగ్‌లో కోహ్లీ సిక్స్ బాది.. నోట్‌బుక్ గెస్టర్ చేసి అతడికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఒక్క సిక్స్ మాత్రమే కాదు.. విలియమ్స్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడని చెప్పాలి.

ఇక కోహ్లీ ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ‘మారి’లో ధనుష్ డైలాగును పెడుతూ.. దానికి సంబంధించిన వీడియోను విపరీతంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ.. మోడరన్ క్రికెట్‌లో వరల్డ్ నెంబర్ వన్ అని చెప్పక తప్పదు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu