జై షా రియల్లీ గ్రేట్: సౌరవ్

జై షా లాంటి వ్యక్తులు క్రికెట్ లో భాగం కావడం మంచి పరిణామమని బిసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పేర్కొన్నారు. హోం మినిస్టర్ అమిత్ షా కుమారుడు జై షాను బీసీసీఐ నూతన కార్యదర్శిగా నియమించడంపై తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై గంగూలీ మాట్లాడుతూ.. గొప్ప వ్యక్తుల వారసులు, స్వతంత్రంగా ఎదగడంపై వస్తోన్న విమర్శలు బాధాకరమని తెలిపాడు. దీనికి ఉదాహరణగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను చూపించాడు. సచిన్ టెండూల్కర్ కుమారుడు ఎందుకు క్రికెట్ […]

జై షా రియల్లీ గ్రేట్: సౌరవ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 07, 2019 | 5:04 PM

జై షా లాంటి వ్యక్తులు క్రికెట్ లో భాగం కావడం మంచి పరిణామమని బిసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పేర్కొన్నారు. హోం మినిస్టర్ అమిత్ షా కుమారుడు జై షాను బీసీసీఐ నూతన కార్యదర్శిగా నియమించడంపై తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై గంగూలీ మాట్లాడుతూ.. గొప్ప వ్యక్తుల వారసులు, స్వతంత్రంగా ఎదగడంపై వస్తోన్న విమర్శలు బాధాకరమని తెలిపాడు. దీనికి ఉదాహరణగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను చూపించాడు. సచిన్ టెండూల్కర్ కుమారుడు ఎందుకు క్రికెట్ ఆడటం మానేయాలి. ఎందుకంటే అతడు టెండూల్కర్ కుమారుడు కాబట్టి. ఇలా ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్‌లో జరగదు” అని గంగూలీ వివరించాడు. క్రికెట్ బోర్డు నూతన కార్యదర్శిగా నియమించబడ్డ జై షాను సౌరవ్ గంగూలీ పొగడ్తలతో ముంచెత్తాడు.

జై షా విషయంలో.. అతను అమిత్ షా కొడుకు అయితే ఏంటి? ఆయన ఎన్నికల్లో గెలిచారు. జై షా ఇంతకుముందు గుజరాత్ క్రికెట్ కు  తమ సేవలు అందించారు. అతను స్వయంగా ఉండటానికి అనుమతించాలి. గత నెల రోజులుగా నేను జై షా తో కలిసి పనిచేస్తున్నాను అని గంగూలీ స్పష్టంచేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. బోర్డు కార్యదర్శిగా జై షా ఎన్నికయ్యాడు.