AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ నుంచి తప్పుకోవడానికి కారణమిదే: రైనా

ఐపీఎల్ ప్రారంభం అవ్వకముందే చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ షాక్‌ల మీద షాక్‌లు పడ్డాయి. ఇప్పటికే చెన్నై టీమ్‌లో 13 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా

ఐపీఎల్ నుంచి తప్పుకోవడానికి కారణమిదే: రైనా
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 30, 2020 | 5:03 PM

Share

Suresh Raina IPL 2020: ఐపీఎల్ ప్రారంభం అవ్వకముందే చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ షాక్‌ల మీద షాక్‌లు పడ్డాయి. ఇప్పటికే చెన్నై టీమ్‌లో 13 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా.. టాప్ బ్యాట్స్‌మన్ సురేష్‌ రైనా ఈ సీజన్‌ నుంచి తప్పుకున్నారు. మొన్నటివరకు ప్రాక్టీస్ కూడా చేసిన రైనా వ్యక్తిగత కారణాల వలన ఈ సీజన్‌ నుంచి తప్పుకుంటున్నట్లు టీమ్‌ వెల్లడించింది. కాగా జట్టులో కీలకమైన ఆటగాళ్లలో ఒకరైన రైనా ఐపీఎల్‌ నుంచి తప్పుకోవడంతో అభిమానులు కూడా బాగా ఫీలవుతున్నారు. అయితే ఐపీఎల్‌ నుంచి తాను ఎందుకు తప్పుకోవల్సి వచ్చిందో తాజాగా రైనా వివరణ ఇచ్చారు.

నా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే తాను ఐపీఎల్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందంటూ రైనా వివరించారు. ‘పిల్లల కంటే ఏది ముఖ్యం అనిపించలేదు” అంటూ ఓ ఇంటర్వ్యూలో ఈ క్రికెటర్‌ తెలిపారు. కాగా రైనా, ప్రియాంక దంపతులకు గ్రేసియా(4సంవత్సరాలు), రియో(5 నెలలు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో వారి గురించి ఆలోచించిన రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

కాగా రైనా కుటుంబంలో మరో విషాదం నెలకొంది. పటాన్‌కోట్‌లో రైనా అంకుల్ కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ క్రమంలో అతడి అంకుల్ మరణించగా.. మిగిలిన వారికి తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Read More:

వెంటనే నా కలలోకి వచ్చిన సుశాంత్‌ ఏం చెప్పాడంటే

కోలుకున్న వారికి మళ్లీ కరోనా.. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే

Follow Us
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..