AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6,4,0,2.. ధోని, రో-కోలకే కాదు, ఇకపై ఏ భారత కెప్టెన్‌కు దక్కని ‘క్యాప్ నంబర్ 278’ అరుదైన రికార్డ్..!

Ajinkya Rahane Retirement: ఒక సాధారణ ఆటగాడిగా జట్టులోకి వచ్చి ప్రపంచం గర్వించదగ్గ దిగ్గజ నాయకుడిగా ఎదిగిన అజింక్య రహానే ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. బ్యాట్ పక్కనపెట్టినా భవిష్యత్తులో అతను మరేదైనా రూపంలో భారత క్రికెట్‌కు తన అమూల్యమైన సేవలు అందిస్తాడని క్రీడాలోకం గట్టిగా ఆశిస్తోంది.

6,4,0,2.. ధోని, రో-కోలకే కాదు, ఇకపై ఏ భారత కెప్టెన్‌కు దక్కని 'క్యాప్ నంబర్ 278' అరుదైన రికార్డ్..!
Ajinkya Rahane Retirement
Venkata Chari
|

Updated on: Jul 30, 2026 | 4:02 PM

Share

Ajinkya Rahane Retirement: క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ భారత వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలికాడు. క్లిష్ట సమయాల్లో అద్భుత విజయాలు అందించిన ఈ ఆపద్బాంధవుడు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక శకం ముగిసింది. క్యాప్ నంబర్ 278 సైనింగ్ ఆఫ్ అంటూ సోషల్ మీడియాలో అతను చేసిన ప్రకటన ప్రతి అభిమాని కంటతడి పెట్టిస్తోంది.

జూలై 30, 2026 నాడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ “ఇన్ని సంవత్సరాలుగా మీరు చూపించిన ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు, ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ రహానే భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నాడు. 36 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించిన రహానే.. 2011 ఆగస్టు 31న జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. సుదీర్ఘ కెరీర్‌లో 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లలో దేశానికి గర్వకారణంగా ప్రాతినిధ్యం వహించాడు.

ఇది కూడా చదవండి: ఆ నలుగురు చెత్త ఫీల్డర్లను పీకేయండి.. ఇంకెన్నాళ్లు దాచిపెడతారు..: బీసీసీఐపై గవాస్కర్ ఫైర్..!

ఇవి కూడా చదవండి

రహానే బ్యాటింగ్ చేస్తుంటే ఒక అందమైన కళాఖండాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. టెస్టుల్లో 38.46 సగటుతో 5,077 పరుగులు సాధించి తన సత్తా చాటాడు. ఇందులో 12 అద్భుతమైన సెంచరీలు, 26 అర్ధ శతకాలు ఉన్నాయి. వన్డేల్లో 2,962 పరుగులు చేయగా, అందులో మూడు శతకాలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 20 టీ20 మ్యాచ్‌లలో 375 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. మైదానంలో అతను చూపించిన ప్రశాంతత, అద్భుతమైన బ్యాటింగ్ శైలి, నిరాడంబరమైన నాయకత్వం ఎందరికో ఆదర్శం.

ఎప్పటికీ చెరిగిపోని అజేయ సారథి..

టీమిండియా చరిత్రలో ఎందరో దిగ్గజ కెప్టెన్లు ఉన్నప్పటికీ రహానే పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డు బహుశా ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎంతోమంది గొప్ప నాయకులు దశాబ్దాల పాటు కెప్టెన్సీ చేసినా, రహానే మాత్రం భారత జట్టుకు నాయకత్వం వహించిన ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఓటమి చవిచూడలేదు. ఆరు టెస్టుల్లో పగ్గాలు చేపట్టిన అతను నాలుగు ఘన విజయాలు అందుకోగా, రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

ఇదికూడా చదవండి: వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. కీలక టోర్నమెంట్‌కు బుడ్డోడు రెడీ.. కెప్టెన్‌గా ఎవరో తెలిస్తే షాకే..?

ఓటమి ఎరుగని భారత టెస్ట్ కెప్టెన్ల రికార్డులు:

అజింక్య రహానే (2017–2021): 6 టెస్టులు, 4 విజయాలు, 0 ఓటములు, 2 డ్రాలు.

కృష్ణమాచారి శ్రీకాంత్ (1989): 4 టెస్టులు, 0 విజయాలు, 0 ఓటములు, 4 డ్రాలు.

రవిశాస్త్రి (1988): 1 టెస్ట్, 1 విజయం, 0 ఓటములు, 0 డ్రాలు.

హేము అధికారి (1959): 1 టెస్ట్, 0 విజయాలు, 0 ఓటములు, 1 డ్రా.

ఆస్ట్రేలియా గడ్డపై ఆ చారిత్రక ఘట్టం..

రహానే కెరీర్‌ను గుర్తుచేసుకున్నప్పుడు 2020-21 బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఎప్పటికీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది. అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే కుప్పకూలిన భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ వెంటనే విరాట్ కోహ్లీ స్వదేశానికి పయనమయ్యాడు. నైతికంగా దెబ్బతిన్న ఆ పరిస్థితుల్లో మెల్‌బోర్న్ టెస్టులో అద్భుతమైన శతకంతో జట్టుకు ఒంటరి పోరాటం చేసి చారిత్రక విజయాన్ని అందించాడు.

ఇదికూడా చదవండి: తొలుత 175 పరుగులు, ఆ తర్వాత 9 వికెట్లు.. లంకను దహనం చేసిన టీమిండియా తోపు

ఆ సిరీస్‌లోని వివిధ దశల్లో మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, బుమ్రా, రవీంద్ర జడేజా, అశ్విన్, హనుమ విహారి లాంటి స్టార్ ఆటగాళ్లంతా గాయాల పాలై తప్పుకున్నా అతను ఏమాత్రం భయపడలేదు. రక్షణాత్మక క్రికెట్ ఆడే ఉద్దేశాన్ని పక్కనపెట్టి యువకులను ముందుండి నడిపించాడు. అనుభవం లేని మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, శార్దూల్ ఠాకూర్ లాంటి వాళ్లపై పూర్తి నమ్మకం ఉంచాడు. గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా అహంకారాన్ని అణిచివేసి సిరీస్‌ను 2-1 తేడాతో గెలిపించిన తీరు భారతీయ క్రీడా చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం.

కన్నీటి వీడ్కోలు.. మిగిలిన శూన్యం..

క్రమశిక్షణ, నిరాడంబరత, నిశ్శబ్ద పోరాటాలకు మారుపేరుగా నిలిచిన రహానే కెరీర్ ముగింపు కాస్త బాధాకరంగానే సాగింది. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో అతను తన ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అందులో భారీ స్కోరు సాధించలేకపోవడంతో సెలెక్టర్లు జట్టు నుంచి పక్కనపెట్టారు. తాను ఎప్పుడూ తనకంటే దేశం, జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేశానని తన వీడ్కోలు సందేశంలో రహానే పేర్కొన్నాడు. సరైన ఉద్దేశంతో నిజాయితీగా ఆడితే ప్రతిఫలం కచ్చితంగా దక్కుతుందని అతను బలంగా నమ్మాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us