ఫ్యాన్ కోరికకు స్ట‌న్న‌యిన భార‌త‌ ఫుట్​బాల్ టీమ్ కెప్టెన్ ఛెత్రి…

ఫ్యాన్ కోరికకు స్ట‌న్న‌యిన భార‌త‌ ఫుట్​బాల్ టీమ్ కెప్టెన్ ఛెత్రి...

మ‌నం ఆరాధించే సెల‌బ్రిటీలు క‌నిపిస్తే ఓ ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ అడుగుతాం. మ‌రీ ప్రేమిస్తే ఓ హ‌గ్ అడిగి మురిసిపోతాం. కానీ తన ఫ్యాన్ అడిగిన కోరికకు భార‌త ఫుట్​బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆశ్చ‌ర్య‌పోయాడు. ఆ విషయాన్ని స్క్రీన్​షాట్ ట్విట్టర్​లో పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఆ ట్వీట్ వైర‌ల్ గా మారింది. ఓ ఫ్యాన్ భారత ఫుట్​బాలర్​ సునీల్ ఛెత్రిని, నెట్​ఫ్లిక్స్ ఐడీ, పాస్​వర్డ్ కావాలని కోరాడు. కావాలంటే లాక్​డౌన్ తర్వాత పాస్​వర్డ్ మార్చుకోమ‌ని సూచిస్తూ అతడికి […]

Ram Naramaneni

| Edited By: Anil kumar poka

May 03, 2020 | 2:01 PM

మ‌నం ఆరాధించే సెల‌బ్రిటీలు క‌నిపిస్తే ఓ ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ అడుగుతాం. మ‌రీ ప్రేమిస్తే ఓ హ‌గ్ అడిగి మురిసిపోతాం. కానీ తన ఫ్యాన్ అడిగిన కోరికకు భార‌త ఫుట్​బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆశ్చ‌ర్య‌పోయాడు. ఆ విషయాన్ని స్క్రీన్​షాట్ ట్విట్టర్​లో పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఆ ట్వీట్ వైర‌ల్ గా మారింది.

ఓ ఫ్యాన్ భారత ఫుట్​బాలర్​ సునీల్ ఛెత్రిని, నెట్​ఫ్లిక్స్ ఐడీ, పాస్​వర్డ్ కావాలని కోరాడు. కావాలంటే లాక్​డౌన్ తర్వాత పాస్​వర్డ్ మార్చుకోమ‌ని సూచిస్తూ అతడికి సోషల్ మీడియాలో మెసేజ్ చేశాడు. దీనిని స్క్రీన్​షాట్​ తీసి ట్వీట్ చేసిన ఛెత్రి.. ఇతడి రిక్వెస్టును పరిగణలోకి తీసుకుంటానని పేర్కొన్నాడు.

“జెర్సీ అడ‌గ‌డం, ఫొటోపై ఆటోగ్రాఫ్, పోస్ట్​కు రిప్లై, పెట్ డాగ్స్ కు విషెస్ చెప్పమని వీడియోలు కోర‌డం.. ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇత‌గాడి రిక్వెస్ట్ చూడండి. అయితే ఈ డిమాండ్​ను నేను పరిగణలోకి తీసుకోవాలని అనుకుంటున్నాను” సునీల్ ఛెత్రి ట్విట్ట‌ర్ లో రాసుకొచ్చాడు.

ఈ క్ర‌మంలో నెట్​ఫ్లిక్స్ యాజ‌మాన్యం స‌రదాగా స్పందించింది. ఎలాగూ టాపిక్ న‌డుస్తుంది కాబ‌ట్టి ఓ ఫోటోపై మీఆటోగ్రాఫ్ పొంద‌గల‌మా అని ప్ర‌శ్నించింది. నెట్​ఫ్లిక్స్ కు అంతే ఫ‌న్నీగా ఆన్స‌ర్ ఇచ్చాడు ఛెత్రి. మీరు అత‌డికి రెండు నెల‌లు నెట్​ఫ్లిక్స్ స‌భ్య‌త్వం ఇవ్వండి..నేను మీకు జెర్సీపై ఆటోగ్రాఫ్ పంపుతాను..డీల్ కి సిద్ద‌మా అని రాసుకొచ్చాడు.

కాగా క‌రోనాను క‌ట్ట‌డి చేసే చ‌ర్య‌ల్లో భాగంగా ఆసియన్ ఫుట్​బాల్ కాన్ఫెడరేషన్​తో కలిసి పనిచేస్తున్నాడు ఛెత్రి. ఇందులో భాగంగా ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu