కామన్ వెల్త్‌ టీటీలో హ్యాట్రిక్ కొట్టిన ఆకుల శ్రీజ

కామన్ వెల్త్ టేబుల్‌ టెన్నిస్‌‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ సత్తా చాటింది. కామన్ వెల్త్ టేబుల్ టెన్నీస్ ఛాంపియన్ షిప్‌లో మూడు పతకాలతో తన సత్తా చాటింది. ఓ రజతం, రెండు కాంస్యాలు తన సొంతం చేసుకుంది. సీనియర్‌ ఆటగాడు ఆచంట శరత్‌ కమల్‌తో కలిసి ఆదివారం మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది శ్రీజ. మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్‌ చేరిన శ్రీజ తుదిపోరుకు ప్రవేశించడంలో విఫలమై కంచు పతకంతో సంతృప్తి చెందింది. భారత్‌కే చెందిన […]

కామన్ వెల్త్‌ టీటీలో హ్యాట్రిక్ కొట్టిన ఆకుల శ్రీజ
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2019 | 10:24 AM

కామన్ వెల్త్ టేబుల్‌ టెన్నిస్‌‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ సత్తా చాటింది. కామన్ వెల్త్ టేబుల్ టెన్నీస్ ఛాంపియన్ షిప్‌లో మూడు పతకాలతో తన సత్తా చాటింది. ఓ రజతం, రెండు కాంస్యాలు తన సొంతం చేసుకుంది. సీనియర్‌ ఆటగాడు ఆచంట శరత్‌ కమల్‌తో కలిసి ఆదివారం మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది శ్రీజ. మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్‌ చేరిన శ్రీజ తుదిపోరుకు ప్రవేశించడంలో విఫలమై కంచు పతకంతో సంతృప్తి చెందింది. భారత్‌కే చెందిన మధురిక పాట్కర్‌ 4-1తో శ్రీజను ఓడించి ఫైనల్‌ చేరింది. అయితే, ఫైనల్లో భారత అమ్మాయి అయికా ముఖర్జీ 4-0తో మధురికపై గెలిచి స్వర్ణం ఎగరేసుకుపోయింది.

ఇక, మహిళల డబుల్స్‌లో శ్రీజ రజతం దక్కించుకుంది. ఫైనల్లో శ్రీజ-మౌసమీ పాల్‌ జోడీ 3-1తో సహచర జంట పూజా సహస్రాబుధె-క్రిత్విక సిన్హారాయ్‌ చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌, డబుల్స్‌లో క్లీన్‌స్వీప్‌ చేస్తూ భారత ఆటగాళ్లే చాంపియన్లుగా నిలిచారు. సింగిల్స్‌ టైటిల్‌ పోరులో హర్మీత్‌ దేశాయ్‌ 4-3తో సాథియాన్‌పై గెలిచి స్వర్ణం నెగ్గగా.. ఆంథోనీ అమల్‌ రాజ్‌-మానవ్‌ టక్కర్‌ జంట 3-1తో టాప్‌సీడ్‌ జోడీ సాథియాన్‌-శరత్‌ కమల్‌కు షాకిచ్చి డబుల్స్‌ విజేతగా నిలిచింది. దీంతో భారత్‌ మొత్తం ఏడు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలు సాధించి అగ్రస్థానంతో టోర్నీని ముగించింది. ఇంగ్లండ్‌ రెండు రజతాలు, మూడు కాంస్యాలతో రెండోస్థానంలో నిలవగా.. ఆరు కాంస్యాలతో సింగపూర్‌ మూడో స్థానం దక్కించుకుంది.