AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెప్టె‌న్‌గా విరాట్ వ‌ద్దు‌…హిట్‌మ్యాన్‌ ముద్దు‌.. బీసీసీఐకి అభిమానుల ట్వీట్లు!

వెస్టిండీస్‌ పర్యటనకు టీమిండియాను ఎంపిక చేశారు. ముందుగా అనుకున్నట్టే బీసీసీఐ సెలక్టర్లు యువకులకు పెద్దపీట వేశారు. మిడిలార్డర్‌లో మనీశ్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌కు మళ్లీ అవకాశం కల్పించారు. అంతేకాకుండా నవదీప్‌ సైనీ, రాహుల్‌ చాహర్‌ వంటి కొత్తవారితో అరంగేట్రం చేయించనున్నారు. అయితే టెస్టు, వన్డే, టీ20 జట్లకు విరాట్‌ కోహ్లీనే సారథిగా ప్రకటించడంపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఐదు శతకాలు బాది, ఐపీఎల్‌లో నాలుగు ట్రోఫీలు గెలిచిన రోహిత్‌ శర్మకు […]

కెప్టె‌న్‌గా విరాట్ వ‌ద్దు‌...హిట్‌మ్యాన్‌ ముద్దు‌.. బీసీసీఐకి అభిమానుల ట్వీట్లు!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 23, 2019 | 3:14 AM

Share

వెస్టిండీస్‌ పర్యటనకు టీమిండియాను ఎంపిక చేశారు. ముందుగా అనుకున్నట్టే బీసీసీఐ సెలక్టర్లు యువకులకు పెద్దపీట వేశారు. మిడిలార్డర్‌లో మనీశ్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌కు మళ్లీ అవకాశం కల్పించారు. అంతేకాకుండా నవదీప్‌ సైనీ, రాహుల్‌ చాహర్‌ వంటి కొత్తవారితో అరంగేట్రం చేయించనున్నారు. అయితే టెస్టు, వన్డే, టీ20 జట్లకు విరాట్‌ కోహ్లీనే సారథిగా ప్రకటించడంపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఐదు శతకాలు బాది, ఐపీఎల్‌లో నాలుగు ట్రోఫీలు గెలిచిన రోహిత్‌ శర్మకు సారథ్యం ఎందుకు అప్పగించడం లేదని ట్విటర్‌లో ప్రశ్నిస్తున్నారు. ఇదేదో చినికి చినికి గాలివానగా మారేలా కనిపిస్తోంది. పైగా విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ మధ్య అభిప్రాయబేధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

కాగా… కోహ్లీ సారథ్యంలో భారత్‌ ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాక్‌ చేతిలో ఓడింది. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌లో కివీస్‌ చేతిలో పరాజయం పాలైంది. గెలిచే సత్తా ఉన్నప్పటికీ కోహ్లీ ఏం చేయలేకపోతున్నాడని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును విరాట్‌ ఒక్కసారీ విజేతగా నిలపలేకపోవడం గమనార్హం.

అయితే…ఐపీఎల్ లో అత్యుత్తమ సారథి రోహిత్‌ శర్మ. ముంబయి ఇండియన్స్‌ను నాలుగు సార్లు విజేగా నిలిపాడు. జట్టులో అందరినీ గౌరవిస్తాడు. కోచ్‌, మెంటార్‌ చెప్పిన పనిని చెప్పినట్టు చేస్తాడు. కీలక సమయాల్లో బౌలర్లను ఉపయోగించడంలో దిట్ట.

Follow Us
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..