ఇక సఫారీ జట్టుకు కత్తి మీద సామే.!

ప్రపంచకప్‌కు వన్ అఫ్ ది ఫేవరెట్‌గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా… ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ జట్టు ఆడిన మొదటి మూడు మ్యాచ్‌లలో ఘోర పరాజయాలు ఎదుర్కొంది. ఇకపోతే నిన్న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మొత్తానికి రెండు జట్లకు చెరో పాయింట్ లభించడంతో చివరికి డుప్లెసిస్ సేన తన ఖాతా తెరిచింది. అయితే ప్రస్తుత ప్రపంచకప్ రౌండ్ రాబిన్ పద్దతి నిర్వహిస్తుండగా సఫారీ జట్టు […]

ఇక సఫారీ జట్టుకు కత్తి మీద సామే.!
Follow us

|

Updated on: Jun 11, 2019 | 3:45 PM

ప్రపంచకప్‌కు వన్ అఫ్ ది ఫేవరెట్‌గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా… ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ జట్టు ఆడిన మొదటి మూడు మ్యాచ్‌లలో ఘోర పరాజయాలు ఎదుర్కొంది. ఇకపోతే నిన్న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మొత్తానికి రెండు జట్లకు చెరో పాయింట్ లభించడంతో చివరికి డుప్లెసిస్ సేన తన ఖాతా తెరిచింది. అయితే ప్రస్తుత ప్రపంచకప్ రౌండ్ రాబిన్ పద్దతి నిర్వహిస్తుండగా సఫారీ జట్టు ఇకపై ఆడే ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

హషీమ్ ఆమ్లా, డికాక్, డుప్లెసిస్, మిల్లర్ ఇలా చాలావరకు హిట్టర్లు ఉన్న ఈ జట్టు వరుస వైఫల్యాలు ఎదుర్కోవడం ఇప్పుడు అందరికి ఓ ప్రశ్నగా మారింది. అటు డాషింగ్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ జట్టు వరుస వైఫల్యాల చూసి పునరాగమనం చేస్తామని చెప్పినా.. దానికి దక్షిణాఫ్రికా బోర్డు నిరాకరించడం సంచలనంగా మారింది.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం టోర్నీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్  హాట్ ఫేవరెట్స్‌గా ఉన్నాయి. ఒకవేళ ఇతర జట్లు కూడా మంచి ప్రదర్శన కనబరిస్తే.. సఫారీలు ఈ ప్రపంచకప్‌పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. గతంలో 1992, 2003 ప్రపంచకప్‌లో జరిగిన ఘటనలు మరువక ముందే మరోసారి వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో వారికి వరుణుడు అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. అటు క్రీడాభిమానులు కొంతమంది సఫారీల ఓటమిపై ట్రోల్స్ చేస్తూ.. ఐపీఎల్‌లో ఆర్సీబీ ఫేట్ ఇప్పుడు దక్షిణాఫ్రికాకు పట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సాటి క్రికెట్ ప్రేమికుడికి సఫారీల వైఫ్యలాలు మింగుడుపడట్లేదనే చెప్పాలి.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు