ధావన్ స్థానంలో పంత్..?
ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న భారత్‌కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ వేలి గాయం కారణంగా మూడు వారాల పాటు ప్రపంచకప్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఇక అతని స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి వస్తాడని ఊహాగానాలు మొదలయ్యాయి. వరల్డ్‌కప్‌కు బీసీసీఐ ప్రకటించిన టీమిండియాలో పంత్ లేకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అతడు అవసరమని జట్టు నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం. దీంతో పంత్‌ను ఇంగ్లాండ్‌కు పంపాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. […]
ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న భారత్‌కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ వేలి గాయం కారణంగా మూడు వారాల పాటు ప్రపంచకప్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఇక అతని స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి వస్తాడని ఊహాగానాలు మొదలయ్యాయి. వరల్డ్‌కప్‌కు బీసీసీఐ ప్రకటించిన టీమిండియాలో పంత్ లేకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అతడు అవసరమని జట్టు నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం. దీంతో పంత్‌ను ఇంగ్లాండ్‌కు పంపాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా గురువారం జరగబోయే న్యూజిలాండ్ మ్యాచ్‌కు పంత్ చేరుకోలేదు కాబట్టి ఆదివారం జరగనున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండవచ్చని తెలుస్తోంది.