దాదా కంటే బెస్ట్ కెప్టెన్ రాలేరు : అక్తర్
బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఇండియా తరఫున బెస్ట్ కెప్టెన్ దాదానే అని పేర్కొన్నాడు.

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఇండియా తరఫున బెస్ట్ కెప్టెన్ దాదానే అని పేర్కొన్నాడు. ”గంగూలీని మరిపించే సారథిని ఇండియా తీసుకురాలేదు. ధోనీ అద్భుతమైన కెప్టెన్. కానీ టీమ్ ను ముందుండి నడిపించడంలో గంగూలీనే ప్రతిభావంతుడు. 2004లో అతడి లీడర్షిప్ లో పాక్ పర్యటనకు ఇండియా వచ్చింది. మమ్మల్ని వాళ్లు ఓడిస్తారనే ఫీలింగ్ కలిగింది. అనుకున్నట్టే జరిగింది. అతడు జట్టు సభ్యుల్లో ఆత్మ విశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపుతాడు” అని పేర్కొన్నాడు.
అంతేకాదు…బెంగాలీలను తాను ఎంతో అభిమానిస్తానని, వారు ఎంతో ధైర్యవంతులని అక్తర్ తెలిపాడు. ఐపీఎల్ ఫస్ట్ సీజన్‌లో దాదా కెప్టెన్సీలో అక్తర్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఆడిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ అధ్యక్షుడుగా సేవలందిస్తున్న గంగూలీ ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని క్రీడావర్గాల సమాచారం. ప్రజంట్ ఛైర్మన్ శశాంక్ మనోహర్ ప్లేసులో ఇంగ్లాండ్ బోర్డు అధ్యక్షుడు కోలిన్ గ్రేవ్స్ ఎంపిక అవుతాడని నిన్నమొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు గంగూలీ పేరు గట్టిగా వినిపిస్తోంది.





