మాజీ రంజీ క్రికెటర్ అనుమానాస్పద మృతి.. కొడుకు అరెస్ట్..
1982-84 మధ్య కేరళ రంజీ టీమ్ తరపున ఆడిన జయమోహన్ తంపి తన ఇంట్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. దీనితో అతని కుమారుడు అశ్విన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గత వారం మనాకాడ్‌లోని జయమోహన్ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు అతని ఇంట్లో అద్దెకు ఉంటున్నవారు గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడంతో అక్కడ కుళ్ళిన స్థితిలో ఉన్న శవాన్ని గుర్తించారు. దీనితో అనుమానం వ్యక్తం చేసిన […]

1982-84 మధ్య కేరళ రంజీ టీమ్ తరపున ఆడిన జయమోహన్ తంపి తన ఇంట్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. దీనితో అతని కుమారుడు అశ్విన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గత వారం మనాకాడ్‌లోని జయమోహన్ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు అతని ఇంట్లో అద్దెకు ఉంటున్నవారు గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడంతో అక్కడ కుళ్ళిన స్థితిలో ఉన్న శవాన్ని గుర్తించారు. దీనితో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతని కొడుకు అశ్విన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మృతదేహం దొరికినప్పటికే తంపి మరణించి 36 గంటలు అయిందని.. తలకి బలమైన గాయం కావడం వల్లే అతను మరణించినట్లు శవపరీక్ష నివేదికలో తేలింది. దీనితో పోలీసులు తమదైన శైలిలో అశ్విన్‌ను విచారించగా.. అసలు నిజం బయటికి వచ్చింది. మద్యం కొనడానికి తంపి నిరాకరించడంతో వీరిద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఆ సమయంలోనే అశ్విన్ తంపిని బలంగా తొయ్యడంతో అతని తల గోడకు బలంగా తాకింది. దీనితో తంపి అక్కడిక్కడే మృతి చెందాడని దర్యాప్తు చేస్తున్న ఓ అధికారి వివరించారు. కాగా, ఈ కేసులో పోలీసులు అశ్విన్‌ను కోర్టులో హాజరు పరిచారు.




