Legal Catch: ఇంతకీ ఈ క్యాచ్ లీగలా..? ఇల్లీగలా..? నెట్టింట చర్చకు దారి తీసిన ఈ క్యాచ్‌ను మీరూ ఓసారి చూడండి..
Legal Catch: క్రికెట్ అంటేనే ఎన్నో అద్భుతాలకు నెలవు. మెరుపు షాట్‌లు, అద్భుతమైన క్యాచ్‌లు, ఆశ్చర్యాన్ని కలిగించే ఫీల్డింగ్‌లు ఇలా ప్రతీ క్షణం వీక్షకులకు ఉత్సాహాన్ని అందిస్తుంది. అప్పటి వరకు ఓడిపోతుందనుకుంటున్న జట్టు గెలిచేస్తుంది...
Legal Catch: క్రికెట్ అంటేనే ఎన్నో అద్భుతాలకు నెలవు. మెరుపు షాట్‌లు, అద్భుతమైన క్యాచ్‌లు, ఆశ్చర్యాన్ని కలిగించే ఫీల్డింగ్‌లు ఇలా ప్రతీ క్షణం వీక్షకులకు ఉత్సాహాన్ని అందిస్తుంది. అప్పటి వరకు ఓడిపోతుందనుకుంటున్న జట్టు గెలిచేస్తుంది. గెలుస్తుందని భావించిన జట్టు చిత్తుగా ఓడిపోతుంది. మ్యాచ్ జరుగుతోన్న సమయంలో జరిగే కొన్ని అంశాలు క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకుకోవడంతో పాటు ఆలోజింపచేస్తుంటాయి. ఇక సోషల్ మీడియా విస్తృతి పెరిగిన్పటి నుంచి ఇలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అక్కడితో ఆగకుండా ఓ పెద్ద చర్చకే దారి తీసింది. ఇంతకీ విషయమేంటంటే.. షెఫల్డ్ టోర్నీలో భాగంగా న్యూసౌత్‌వేల్స్, క్వీన్‌లాండ్స్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో సౌత్‌వేల్స్ బ్యాట్స్‌మెన్ బాక్స్‌టర్ హోల్డ్ బంతిని భారీ షాట్ ఆడాడు. దీంతో గాలిలో తేలిన బంతిని అదే సమయంలో కవర్స్‌లో ఫీల్లడింగ్ చేస్తున్న లబూషేన్ అందుకునే క్రమంలో చేతులోకి తీసుకున్నాడు. అయితే క్యాచ్‌ను అందుకున్న కొన్ని క్షణాల్లోనే పరుగెత్తుతూనే బంతిని కింద పడేశాడు. అంపైర్లు అవుట్‌గా నిర్ణయించారు. అందరూ కూడా అవుట్ అని భావించారు. కానీ ఇప్పుడు నెట్టింట్లో దీనిపై చర్చ మొదలైంది. ఇంతకీ ఆ ప్లేయర్ క్యాచ్‌ను తీసుకున్నాడా.? లేదా డ్రాప్ చేశాడా అంటూ ట్విట్టర్‌లో ఓ చర్చ జరుగుతోంది. కొంత మంది ఇది ఇల్లీగల్ క్యాచ్ అంటుంటే.. మరికొందరు మాత్రం లీగల్ క్యాచ్ అంటూ గతంలో జరిగిన ఇలాంటి కొన్ని సంఘటనలను ఉదాహరణిస్తున్నారు. మరి ఓ సారి ఈ వీడియోను మీరూ చూసి ఈ క్యాచ్ లీగలా..? ఇల్లీగలా..? మీరేం అనుకుంటున్నారో చెప్పండి.
నెట్టింట చర్చకు దారితీసిన వీడియో ఇదే..
A ‘peculiar’ ending to the NSW innings, with this deemed to be a legal catch #SheffieldShield pic.twitter.com/T4gQgr1Rc2
— cricket.com.au (@cricketcomau) April 4, 2021
IPL 2021: బ్యాటింగ్, బౌలింగ్ ప్రధాన బలం.. మిగతా జట్లకు అదే ప్రమాదం..!
IPL 2021: ఏం క్రియేటివిటీ.. టాలీవుడ్ స్టార్ హీరోల స్టైల్‌లో అదరగొడుతోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్..