గాయం కన్నా.. గెలవడం మిన్న: రక్తం చిందిన షేన్ వాట్సన్

ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఒక్క పరుగు తేడాతో ట్రోఫీని మిస్ చేసుకుంది. కానీ ఆ టీం క్రికెటర్లందరూ వీక్షకుల మనసును చూరగొన్నారు. ఈ మ్యాచ్‌ను గెలిచేందుకు చివరి బంతి వరకు చెన్నై క్రికెటర్లు పడ్డ కష్టాన్ని అందరూ ప్రత్యక్షంగా చూశారు. ఇక ఈ ఆటలో ఓపెనర్ షేన్ వాట్సన్ ఎంతో శ్రమించారు. చివరి వరకు టీంను గెలిపించేందుకు చాలా కష్టపడ్డాడు. ఈ క్రమంలో తనకు తగిలిన గాయాన్ని కూడా పట్టించుకోలేదు. దానికి సంబంధించిన […]

గాయం కన్నా.. గెలవడం మిన్న: రక్తం చిందిన షేన్ వాట్సన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 14, 2019 | 11:54 AM

ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఒక్క పరుగు తేడాతో ట్రోఫీని మిస్ చేసుకుంది. కానీ ఆ టీం క్రికెటర్లందరూ వీక్షకుల మనసును చూరగొన్నారు. ఈ మ్యాచ్‌ను గెలిచేందుకు చివరి బంతి వరకు చెన్నై క్రికెటర్లు పడ్డ కష్టాన్ని అందరూ ప్రత్యక్షంగా చూశారు. ఇక ఈ ఆటలో ఓపెనర్ షేన్ వాట్సన్ ఎంతో శ్రమించారు. చివరి వరకు టీంను గెలిపించేందుకు చాలా కష్టపడ్డాడు. ఈ క్రమంలో తనకు తగిలిన గాయాన్ని కూడా పట్టించుకోలేదు. దానికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఆట మధ్యలో వాట్సన్‌ కాలికి దెబ్బ తగిలింది. మోకాలి వద్ద తగిలిన దెబ్బకు రక్తం కారుతూనే ఉంది. ఒకానొక సమయంలో నొప్పిని భరించలేకపోయాడు. అయినా తన టీమ్‌ను గెలిపించాలన్న ఆశయంతో.. దాన్ని పట్టించుకోకుండా పరుగులు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో చివర్లో పరిగెత్తలేక రనౌట్ అయ్యాడు. కాగా వాట్సన్ కాలికి గాయం తగిలిన ఫొటోలను చెన్నై టీం క్రికెటర్ హర్భజన్ సింగ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ‘వాట్సన్ నువ్వు చాలా గ్రేట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.