ఉప్పల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా ?

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ మీద విక్టరీ సాధించ వచ్చుగాక! ఈ ‘ వ్యవహారం ‘ లో లాభ పడింది మాత్రం బుకీలే అన్న మాట వినిపిస్తోంది. రిజల్ట్ తో నిమిత్తం లేకుండా పంటర్లు (పందెం రాయుళ్ళు) తమ సొమ్మును రెండు టీమ్స్ పైనా పెట్టారు. ధోనీ అవుట్ అనే థర్డ్ ఎంపైర్ నిర్ణయాన్ని నిర్ధారించే వీడియో లేకున్నా..అతనికి రనౌట్ […]

ఉప్పల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా ?
Follow us
Anil kumar poka

|

Updated on: May 14, 2019 | 3:50 PM

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ మీద విక్టరీ సాధించ వచ్చుగాక! ఈ ‘ వ్యవహారం ‘ లో లాభ పడింది మాత్రం బుకీలే అన్న మాట వినిపిస్తోంది. రిజల్ట్ తో నిమిత్తం లేకుండా పంటర్లు (పందెం రాయుళ్ళు) తమ సొమ్మును రెండు టీమ్స్ పైనా పెట్టారు. ధోనీ అవుట్ అనే థర్డ్ ఎంపైర్ నిర్ణయాన్ని నిర్ధారించే వీడియో లేకున్నా..అతనికి రనౌట్ ఎందుకిచ్చారు ? బ్యాట్స్ మెన్ కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ‘ పరిధి ‘ లోకి వస్తారని క్రికెట్ ‘ చట్టాలు ‘ చెబుతున్నాయి. ఈ ద్దేశంలో ఇంకా ఇప్పటికీ క్రికెట్ బెట్టింగ్ మార్కెట్ ఇంకా వెర్రి తలలు వేస్తూనే ఉంది. ఐపీఎల్ మ్యాచులు ముందుగానే ఫిక్స్ అయిపోతాయన్న వాదన బలంగానే వినిపిస్తోంది. చివరి బంతిలో మొత్తం మ్యాచ్ ఫలితం అంతా ఆధారపడి ఉంటుంది. అదే కీలకం. ఉప్పల్ పోరులో అన్నీ సందేహాలే.. ఒకదాని వెనుక ఒకటి..అన్నీ అనుమానాస్పదమే.. ఇది చూస్తుంటే .. 2011 వాల్డ్ కప్ లో సెమి ఫైనల్, ఫైనల్ ఫలితాలు ఇప్పటికీ సందేహాలను లేవనెత్తుతున్నాయి. నాడు సచిన్ కొట్టిన బంతుల్లో సింపుల్ వాటిని కూడా పాక్ జట్టు వదిలేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే ఫైనల్ లో వేసిన టాస్ కూడా మిస్టీరియస్ గా ఉండడంతో సెకండ్ టాస్ వేశారు. ఈ ఫిక్సింగ్ కూడా ఓ రకమైన గ్యాంబ్లింగ్ అంటే అతిశయోక్తి కాదంటున్నారు. క్రికెట్ ప్రపంచంలో జరిగే తెరవెనుక ‘ పాలిటిక్స్ ‘ కొత్తేమీ కాదు. కానీ ఇప్పటికీ ఇదే తంతు కొనసాగడమే విచారకరం. అంతా ముందే ‘ ఫిక్సే ‘ అయితే..ఇది అందరికీ తెలిసిందే అయినా.. లాభ పడేది బుక్ మేకర్లే..మహా సంగ్రామమంటూ జరిగే పోరు వెనుక ఈ జుగుప్సాకర ‘ వైనం ‘ ఎప్పుడు అంతమవుతుందోనని అసలైన క్రికెట్ ప్రియులు ఆశతో ఎదురు చూస్తున్నారు.