పాక్ టూర్‌‌కు లంకేయన్ల వెనుకంజ.. దానికి కారణం మన ఐపీఎల్ అంటా..!

పాక్ టూర్‌‌కు లంకేయన్ల వెనుకంజ.. దానికి కారణం మన ఐపీఎల్ అంటా..!

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మరోసారి తననోటికి పనిచెప్పాడు. గత కొద్ది రోజులుగా భారత్, పాక్‌ల మధ్య జరుగుతున్న సామాజిక అంశాలపై ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యలు చేయడం అఫ్రిదీకి అలవాటుగా మారింది. అయితే అదే స్థాయిలో అఫ్రిదీకి భారత మాజీ ఓపెనర్ గంభీర్ కౌంటర్ అటాక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రీలంక క్రికెటర్ల విషయంలో ఐపీఎల్‌పై నోరుజారాడు. శ్రీలంక సీనియర్‌ క్రికెటర్లు పాక్‌ పర్యటనకు దూరమవ్వడానికి కారణం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగేనంటూ వ్యాఖ్యానించాడు. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 21, 2019 | 5:13 AM

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మరోసారి తననోటికి పనిచెప్పాడు. గత కొద్ది రోజులుగా భారత్, పాక్‌ల మధ్య జరుగుతున్న సామాజిక అంశాలపై ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యలు చేయడం అఫ్రిదీకి అలవాటుగా మారింది. అయితే అదే స్థాయిలో అఫ్రిదీకి భారత మాజీ ఓపెనర్ గంభీర్ కౌంటర్ అటాక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రీలంక క్రికెటర్ల విషయంలో ఐపీఎల్‌పై నోరుజారాడు. శ్రీలంక సీనియర్‌ క్రికెటర్లు పాక్‌ పర్యటనకు దూరమవ్వడానికి కారణం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగేనంటూ వ్యాఖ్యానించాడు. కొందరు శ్రీలంక ఆటగాళ్లతోనే ఈ విషయం తనకు తెలిసిందంటూ పేర్కొన్నాడు. ఇప్పటికే పాక్ టూర్‌ అనడంతోనే శ్రీలంక సీనియర్ ప్లేయర్లు విముఖత చూపిన విషయం తెలిసందే. పాక్‌లో మ్యాచ్‌లంటే తాము వెళ్లమని మలింగ, కరుణరత్నే, మాథ్యూస్ వంటి సీనియర్లు లంక బోర్డుకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అఫ్రిదీ ఐపీఎల్‌పై ఆరోపణలు చేశాడు.

శ్రీలంక క్రికెటర్లపై ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఫ్రాంచైజీల ఒత్తిడి ఉందని..పాకిస్థాన్‌లో పర్యటించడంతో పాటు.. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడేదాని గురించి చివరి సారి కలిసినప్పుడు చర్చించారంటూ పేర్కొన్నారు. కానీ పాకిస్థాన్‌కు వెళ్తే కాంట్రాక్టులు ఇవ్వబోమని ఐపీఎల్‌ యజమానులు బెదిరిస్తున్నారని ఆ క్రికెటర్లు చెప్పారన్నాడు. పాకిస్థాన్‌ ఎప్పుడూ శ్రీలంకకు మద్దతుగానే నిలిచిందని.. మేం శ్రీలంకలో పర్యటించినప్పుడు ఎప్పుడూ స్టార్‌ క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వలేదన్నాడు. శ్రీలంక బోర్డు మరోసారి కలుగజేసుకుని టూర్‌కి సీనియర్లు వచ్చేలా చేయాలని కోరాడు.

కాగా, పాకిస్థాన్‌లో చివరిసారి పర్యటించినప్పుడు శ్రీలంక క్రికెట్‌ టీం వెళ్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది. అప్పుడు పలువురు క్రికెటర్లు స్వల్ప గాయాలపాలయ్యారు. దీంతో వెంటనే ఆ సిరీస్ వదిలేసి.. టూర్ మధ్యలోనే శ్రీలంక ఇంటికి వెళ్లింది. అప్పటి నుంచి ఏ టీం కూడా పాక్‌లో పర్యటించలేదు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu