ధోని అవుట్.. పంత్ డౌట్.. టీమిండియాకు కీపర్ ఎవరు ?

ధోని అవుట్.. పంత్ డౌట్.. టీమిండియాకు కీపర్ ఎవరు ?

వన్ డే క్రికెట్ వరల్డ్ కప్ ముగిసిందో లేదో టీమిండియాకు కొత్త కీపర్ ఎవరు అనే చర్చ మొదలైంది. దానికి కారణం ధోని రిటైర్మెంట్ ఊహాగానాలు.. మరో వైపు ఫ్యూచర్ వికెట్ కీపర్ అనుకున్న రిషబ్ పంత్ వరుస వైఫల్యాలు.. ఈ రెండింటిని చూస్తే కొత్త కీపర్ ఎంపిక అనివార్యం అన్న కామెంట్స్, ఎనాలిసిస్లు ఎక్కువయ్యాయ్యి. దానికి తోడు ధోని ఎటూ తేల్చకుండా విండీస్, సౌత్ ఆఫ్రికా పర్యటనలకు దూరంగా ఉండడం. ఈ రెండు సిరీస్ లకు […]

Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Sep 20, 2019 | 12:43 PM

వన్ డే క్రికెట్ వరల్డ్ కప్ ముగిసిందో లేదో టీమిండియాకు కొత్త కీపర్ ఎవరు అనే చర్చ మొదలైంది. దానికి కారణం ధోని రిటైర్మెంట్ ఊహాగానాలు.. మరో వైపు ఫ్యూచర్ వికెట్ కీపర్ అనుకున్న రిషబ్ పంత్ వరుస వైఫల్యాలు.. ఈ రెండింటిని చూస్తే కొత్త కీపర్ ఎంపిక అనివార్యం అన్న కామెంట్స్, ఎనాలిసిస్లు ఎక్కువయ్యాయ్యి. దానికి తోడు ధోని ఎటూ తేల్చకుండా విండీస్, సౌత్ ఆఫ్రికా పర్యటనలకు దూరంగా ఉండడం. ఈ రెండు సిరీస్ లకు ఫ్యూచర్ కీపర్ గా భావించిన రిషబ్ పంత్ కు సెలక్షన్ కమిటీ ఛాన్స్ ఇవ్వడం, అతను ఈ రెండు సిరీస్ లలో దారుణంగా విఫలం అవడంతో మళ్ళీ విషయం మొదటికొచ్చింది. అయితే ధోని రావాలి లేకపోతె సుదీర్ఘ కలం పాటు జట్టుకు ఆడే సామర్ధ్యం ఉన్న కీపర్ ని వెతకాలి.. ఇదిప్పుడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముందున్న సవాల్. ధోని తిరిగి వస్తాడా అంటే కష్టమే అన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. దానికి తోడు ధోని పని అయిపోయిందంటూ గవాస్కర్ లాంటి సీనియర్ ఆటగాళ్లు, క్రికెట్ అనలిస్టులు, వ్యాఖ్యాతలు ఎవరికీ తోచిన కామెంట్లు వారు చేసేస్తున్నారు. ఎవరి కామెంట్ ఎలా ఉన్న ధోని మాత్రం నోరు మెదపడం లేదు.. ప్రస్తుతానికి ఆటకు విరామమే అన్నట్టు సొంత పనుల్లో ధోని బిజీ బిజీగా గడుపుతున్నాడు. మరో వైపు సౌత్ ఆఫ్రికా జట్టు ఇండియా పర్యటనలో ఉండగానే రిషబ్ పంత్ కు ప్రత్యామ్నాయ ఆటగాని కోసం సెలక్షన్ కమిటీ వేట ప్రారంభించింది. వృద్ధిమాన్ సహా లాంటి వారి పేర్లు పరిశీలనలో ఉన్నా.. ఆటలో నిలకడ లేమి అతనికి మైనస్ పాయింట్ కానున్నది. మరో వైపు రిటైర్మెంట్ ప్రకటించి, తర్వాత నాలుక్కర్చుకుని అబ్బెబ్బే ఎదో ఆవేశంలో రిటైర్మెంట్ ప్రకటించాను.. అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉంటాను అని ప్రకటించిన తెలుగు తేజం అంబటికి రాయుడు పేరును కూడా సెలక్షన్ కమిటీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సుదీర్ఘ కలం జట్టుకు ఆడే సత్తా కలిగిన వికెట్ కీపర్ దొరకడం ఇప్పట్లో కష్టమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu