AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంత్‌కు పాఠాలు నేర్పిన ధోని కూతురు..!

చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని గారాల పట్టి జీవా ధోనికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తన క్యూట్ క్యూట్ మాటలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నారి. ఒక తరుణంలో కింగ్స్ ఎలెవన్ సహా-యజమాని, హీరోయిన్ ప్రీతి జింటా కూడా జీవా ధోనీని ఎప్పుడొకప్పుడు కిడ్నాప్ చేసేస్తానంటూ మాహీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చిందంటే జీవాకి ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఇక తాజాగా జీవా ధోనీకి సంబంధించిన […]

పంత్‌కు పాఠాలు నేర్పిన ధోని కూతురు..!
Ravi Kiran
|

Updated on: May 13, 2019 | 6:16 PM

Share

చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని గారాల పట్టి జీవా ధోనికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తన క్యూట్ క్యూట్ మాటలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నారి. ఒక తరుణంలో కింగ్స్ ఎలెవన్ సహా-యజమాని, హీరోయిన్ ప్రీతి జింటా కూడా జీవా ధోనీని ఎప్పుడొకప్పుడు కిడ్నాప్ చేసేస్తానంటూ మాహీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చిందంటే జీవాకి ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఇక తాజాగా జీవా ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అఆలు నేర్పిస్తూ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది జీవా ధోనీ. క్వాలిఫైయర్ 2 లో ఢిల్లీ తో చెన్నై తలపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ అనంతరం జీవా ధోని పంత్‌కు  పాఠాలు నేర్పింది.

View this post on Instagram

Back to Basics !

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on