టెన్షన్.. టెన్షన్.. ఐపీఎల్-2019 ఫైనల్ హైలైట్స్

బంతి బంతికీ నరాలు తెగే ఉత్కంఠ.. ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి.. స్టేడియంలో ఉన్న వారు, టీవీల్లో చూసే వారు, సామాజిక మాధ్యమాల్లో లైవ్ స్కోర్‌ను తెలుసుకుంటున్న వారు.. ఇలా ప్రతి ఒక్కరిలో ఈ ఐపీఎల్ ఫైనల్ గుండె వేగాన్ని పెంచింది. చివరకు ఒకే ఒక్క పరుగుతో ముంబై ఇండియన్స్ పటిష్ఠ చెన్నైపై విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ 12 సీజన్లకు గానూ నాలుగోసారి టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి టీమ్‌గా నిలిచింది. […]

టెన్షన్.. టెన్షన్.. ఐపీఎల్-2019 ఫైనల్ హైలైట్స్
Follow us

| Edited By:

Updated on: May 13, 2019 | 1:11 PM

బంతి బంతికీ నరాలు తెగే ఉత్కంఠ.. ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి.. స్టేడియంలో ఉన్న వారు, టీవీల్లో చూసే వారు, సామాజిక మాధ్యమాల్లో లైవ్ స్కోర్‌ను తెలుసుకుంటున్న వారు.. ఇలా ప్రతి ఒక్కరిలో ఈ ఐపీఎల్ ఫైనల్ గుండె వేగాన్ని పెంచింది. చివరకు ఒకే ఒక్క పరుగుతో ముంబై ఇండియన్స్ పటిష్ఠ చెన్నైపై విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ 12 సీజన్లకు గానూ నాలుగోసారి టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి టీమ్‌గా నిలిచింది.

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్(41), డీకాక్(29) మినహా ఎవ్వరూ పెద్ద స్కోర్లను చేయలేదు. రోహిత్ శర్మ (15), సూర్యకుమార్ యాదవ్(15), ఇషాన్ కిషన్(23), కృనాల్ పాండ్యా(7), హార్దిక్ పాండ్యా(16)స్కోర్లు మాత్రమే చేశారు. అటు చెన్నై టీంలోని దీపక్ చాహర్ 3వికెట్లతో చెలరేగడంతో రోహిత్ సేన తక్కువ స్కోరుకే పరిమితం అయ్యారు.

ఆ తరువాత చెన్నై బ్యాటింగ్‌కు దిగి.. చివరి బంతి వరకు పోరాడింది. షేన్ వాట్సన్(80) వరుస పరుగులతో ముంబయిని భయపెట్టాడు. డుప్లెసిస్ కూడా ఫైనల్లో రాణించాడు. అయితే ధోని(15), రైనా(8)లు త్వరగా ఔట్ అవ్వడంతో ముంబయి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇక చేజారిపోయిందనుకున్న ప్రతిసారీ బుమ్రా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. రాహుల్ కూడా తన బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చెన్నైపై ఒత్తిడి పెంచాడు. ఇక చెన్నై విజయానికి 18 బంతుల్లో 38 పరుగులు అవసరమైనప్పుడు.. కృనాల్‌ వేసిన 18వ ఓవర్‌లో 20 పరుగులు రాబట్టారు వాట్సన్‌, బ్రావో. అయితే 19వ ఓవర్‌లో బుమ్రా మళ్లీ మాయ చేసి వికెట్‌ తీసి 9 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్‌లో 6 బంతుల్లో 9 పరుగులు కావాలి. అయితే ఈ ఓవర్లో బౌలింగ్ చేపట్టిన మలింగ చెన్నైకు చుక్కలు చూపించాడు. నాలుగో బంతికి వాట్సన్‌ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్‌ అవ్వడం.. చివరి బంతికి శార్దూల్‌ను ఎల్బీ చేయడంతో చెన్నై 147/7కు పరిమితం అయింది. దీంతో ముంబై మరోసారి కప్‌ను సొంతం చేసుకుంది. మొత్తానికి రోహిత్‌ బౌలర్లను అత్యంత వ్యూహాత్మకంగా వినియోగించి తానెంత విలువైన సారథో మరోసారి అందరికీ నిరూపించాడు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..