ఐపీఎల్-2019 అవార్డుల విజేతలు వీరే

మొత్తం 59 మ్యాచ్‌లు.. 50 రోజులు.. 8జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 12వ సీజన్‌ ముగిసింది. ఫైనల్లో ఢిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌పై పైచేయి సాధించిన ముంబయి ఇండియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక ఈ సీజన్‌లో ఆటగాళ్లు తమ సత్తా చాటి ఐపీఎల్‌ను మరింత రక్తి కట్టించారు. దీంతో తగిన నగదు ప్రోత్సాహకాలను అందుకున్నారు. ఇంతకు ఎవరెవరికి ఎంత వచ్చిందంటే.. ఛాంపియన్: ముంబై టీం 20 కోట్లు రన్నరప్: చెన్నై టీం రూ.12.50కోట్లు ఫెయిర్ […]

ఐపీఎల్-2019 అవార్డుల విజేతలు వీరే
TV9 Telugu Digital Desk

| Edited By:

May 13, 2019 | 1:16 PM

మొత్తం 59 మ్యాచ్‌లు.. 50 రోజులు.. 8జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 12వ సీజన్‌ ముగిసింది. ఫైనల్లో ఢిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌పై పైచేయి సాధించిన ముంబయి ఇండియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక ఈ సీజన్‌లో ఆటగాళ్లు తమ సత్తా చాటి ఐపీఎల్‌ను మరింత రక్తి కట్టించారు. దీంతో తగిన నగదు ప్రోత్సాహకాలను అందుకున్నారు. ఇంతకు ఎవరెవరికి ఎంత వచ్చిందంటే..

ఛాంపియన్: ముంబై టీం 20 కోట్లు

రన్నరప్: చెన్నై టీం రూ.12.50కోట్లు

ఫెయిర్ ప్లే అవార్డు: సన్ రైజర్స్ హైదరాబాద్

పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు): ఇమ్రాన్ తాహీర్(చెన్నై సూపర్ కింగ్స్: 10లక్షలు)

ఆరంజ్ క్యాప్(అత్యధిక పరుగులు): డేవిడ్ వార్నర్(సన్‌రైజర్స్ హైదరాబాద్: 10లక్షలు)

అత్యధిక విలువైన ఆటగాడు: ఆండ్రి రసెల్(కోల్‌కతా నైట్‌రైడర్స్, హారియర్ కారుతో పాటు చెక్)

సూపర్‌ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: ఆండ్రి రసెల్(కోల్‌కతా నైట్‌రైడర్స్, 10లక్షలు)

గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్: రాహుల్ చాహర్(ముంబయి ఇండియన్స్: 10లక్షలు)

స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: కేఎల్ రాహుల్(కింగ్స్ ఎలివెన్ పంజాబ్ 10లక్షలు)

అత్యంత వేగవంతమైన అర్ధశతకం: హార్ధిక్ పాండ్యా(ముంబయి ఇండియన్స్: 10లక్షలు)

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: శుభ్‌మన్ గిల్(కోల్‌కతా నైట్ రైడర్స:10లక్షలు)

పర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్: కీరన్ పొలార్డ్(ముంబయి ఇండియన్స్: 10లక్షలు)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu