Ravichandran Ashwin Serious: ఇంగ్లండ్ జర్నలిస్ట్‌పై రవిచంద్రన్ అశ్విన్ సీరియస్.. బాలయ్య డైలాగ్‌ను పేల్చేశాడుగా..!
Ravichandran Ashwin Serious: గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్డేడియంలో జరిగిన పింక్ టెస్ట్ లో ఇంగ్లండ్ జట్టుపై టీమిండియా ఘన విజయం..
Ravichandran Ashwin Serious: గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్డేడియంలో జరిగిన పింక్ టెస్ట్ లో ఇంగ్లండ్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేవలం రెండు రోజుల్లోనే పూర్తైన థర్డ్ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ టీమ్‌ను ఘోరంగా ఓడించింది. అయితే, ఈ మ్యాచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పిచ్‌ను టార్గెట్‌గా చేసుకుని ఎంతో మంది సీనియర్ క్రికెట్ ప్లేయర్లు విమర్శలు గుప్పించారు. తాజాగా ఇదే అంశంపై ఇంగ్లండ్‌కు చెందిన జర్నలిస్టు.. టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌పై పలు ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు అశ్విన్ అంతెత్తు లేచాడు. ఏకంగా బాలయ్య డైలాగ్‌నే వాడేశాడు. ‘అప్పుడు లేవని నోర్లు.. ఇప్పుడు లేస్తున్నాయేంటి?’ అంటూ సీరియస్ అయ్యాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజాగా అశ్విన్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా బ్రిటన్‌కు చెందిన ఓ జర్నలిస్ట్.. పిచ్‌కు సంబంధించి పలు ప్రశ్నలు అశ్విన్‌ను అడిగాడు. మూడో టెస్ట్ కోసం తయారు చేసిన వికెట్ మంచిదేనా అని అశ్విన్‌ను అతను ప్రశ్నించారు. ఆ ప్రశ్నతో అశ్విన్ చిర్రెత్తిపోయాడు. అసలు మంచి పిచ్ అంటే ఏంటి? అని సదరు జర్నలిస్ట్‌లనే ప్రశ్నించాడు. ‘మంచి పిచ్ అంటే ఏమిటి?దాన్ని ఎవరు నిర్వచిస్తారు. తొలిరోజు పేస్ బౌలర్లకు సహకరించి, తర్వాత బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించి.. ఆపై స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తే అది మంచి వికెటా? ఇలాంటి వాటి నుంచి బయటకు రండి. పిచ్ గురించి రాద్దాంతం అనవసరం. పిచ్‌కు సంబంధించినంత వరకు ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఎలాంటి ఫిర్యాదులు లేవు. బయటి వాళ్లే ఈ పిచ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మేం ఏ పర్యటనలోనూ పిచ్ గురించి ఫిర్యాదులు చేయలేదు. అప్పుడు ఎవరూ ఇలా అడగలేదేం?’ అని సదరు జర్నలిస్ట్‌కు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
Also read:
Obscene dances: తెలంగాణలోనూ మొదలైన ‘అశ్లీల’ సంస్కృతి.. కట్టమైసమ్మ జాతరలో వికృత కార్యక్రమాలు..