Indian Hockey Team Return: కోవిడ్ తర్వాత తొలి విజయం.. జర్మనీ జట్టును చిత్తుగా ఓడించిన భారత్..
Indian Hockey Team: కరోనా కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న భారత హాకీ జట్టు.. ఈ ఏడాది తొలి మ్యాచ్‌లోనే తన సత్తా చూపించింది. యూరప్ పర్యటనలో ఉన్న భారత జట్టు జర్మనీలో జరిగిన నాలుగు..
Indian Hockey Team Win: కరోనా కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న భారత హాకీ జట్టు.. ఈ ఏడాది తొలి మ్యాచ్‌లోనే తన సత్తా చూపించింది. యూరప్ పర్యటనలో ఉన్న భారత జట్టు జర్మనీలో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టోర్నీలో తొలి మ్యాచ్‌లో లోకల్ జట్టుపై 6-1 గోల్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. భారత ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం చూపించలేక పోయారు. అద్భుతమైన ఆటతీరుతో జర్మనీ జట్టుకు చుక్కలు చూపించారు. గోల్‌కీపర్ పీఆర్ శ్రేజేష్ జట్టుకు నేతృత్వం దూకుడు ప్రదర్శిస్తోంది.
దాదాపు 12 నెలల తర్వాత ఆడుతున్న భారత జట్టు ప్రత్యర్థి టీమ్‌కు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. గెలవాలన్న కసి వారి ఆటలో స్పష్టంగా కనిపించింది. భారత జట్టు తరఫున నీలకంఠ శర్మ, వివేక్ సాగర్ ప్రసాద్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ, ఆకాశ్ దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ లు గోల్స్ చేశారు.
ఇరు జట్లలో తొలి గోల్‌ను భారత్ తరఫున పెనాల్టీ కార్నర్ ద్వారా సాధించాయి. 14వ నిమిషంలో జర్మనీ మొదటి గోల్ చేసింది. దీంతో స్కోరు 1-1తో సమమైంది. తర్వాత వివేక్ సాగర్ వరుసగా రెండు గోల్స్ సాధించడంతో భారత్ 3-1 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఆ తర్వాత ఆతిథ్య జట్టును ఎక్కడా కోలుకోనివ్వలేదు.
తదుపరి మ్యాచ్ మార్చి 2న జర్మనీతోనే జరగనుంది. మార్చి 6,8 తేదీల్లో గ్రేట్ బ్రిటన్‌తో ఆడనుంది టీమ్ఇండియా.
Give it up for today’s goal scorers! ??
Nilakanta Sharma 13′ Vivek Sagar 27′ 27′ Lalit Upadhyay 41′ Akashdeep Singh 42′ Harmanpreet Singh 47′ pic.twitter.com/OhibXQen7m
— Hockey India (@TheHockeyIndia) February 28, 2021
ఇవి కూడా చదవండి
Smriti Irani: స్ట్రీట్ ఫుడ్‌పై కేంద్ర మంత్రి మోజు.. రోడ్డుపై పానీపూరీ తింటూ కనిపించిన స్మృతి ఇరానీ.. Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఈరోజు తులం గోల్డ్ ఎక్కడ, ఎంత ఉందంటే..