PV Sindhu: త్వరలో సరికొత్త జీవితంలోకి అడుగు పెట్టనున్న పీవీ సింధు.. ప్రముఖ వ్యాపారవేత్తతో పెళ్లి..

భారత స్టార్ షట్లర్ సింధు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన సింధు త్వరలో పెళ్లి కూతురు కానుందని పీవీ సింధు తండ్రి శుభవార్తను మీడియాతో పంచుకున్నారు. భారతీయ క్రీడా స్టార్ హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌తో డిసెంబర్ 22న ఏడడుగులు వేయనుంది.

PV Sindhu: త్వరలో సరికొత్త జీవితంలోకి అడుగు పెట్టనున్న పీవీ సింధు.. ప్రముఖ వ్యాపారవేత్తతో పెళ్లి..
Wedding Bells For Pv Sindhu
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Surya Kala

Updated on: Dec 03, 2024 | 11:54 AM

పీవీ సింధు తన జీవితంలో అందమైన.. సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత బ్యాడ్మింటన్ స్టార్ సింధు త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. డిసెంబర్ 2 సోమవారం రోజున సింధు తండ్రి తన కుమార్తె వివాహం గురించి ఆమె అభిమానులతో .. మీడియాతో శుభవార్త పంచుకున్నారు. పీవీ సింధు భారత దేశ క్రీడా రంగంలో వెలుగొందుతున్న ప్రముఖ క్రీడాకారిణి. బాడ్మింటన్‌లో ఆమె విజయాలు భారతదేశాన్ని గర్వపడేలా చేశాయి. కూతురు పెళ్లి గురించి 2024 డిసెంబర్ 2న సింధు తండ్రి అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ‘లేక్ సిటీ’ ఉదయ్‌పూర్‌లో వివాహ వేడుకను జరిపించనున్నామని సింధు తండ్రి పివి రామన్న తెలిపారు. సింధు పెళ్లి వార్త ఆమె అభిమానులను ఆనందపరిచింది. పీవీ సింధు తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువతి. ఆమె నిఖిల్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకోనున్నారు. నిఖిల్ ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

డిసెంబరు 20 నుంచి వివాహ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, డిసెంబర్ 22న సింధు, వెంకటల పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరపనున్నామని ఆయన చెప్పారు. ఆ తర్వాత డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ పార్టీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ రిసెప్షన్ గ్రాండ్‌గా నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ రిసెప్షన్ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్రీడా ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరుకానున్నారు.

సింధు తన క్రీడా జీవితంలో ఎన్నో విజయాలను సాధించడమే కాకుండా, భారతదేశానికి ఒలింపిక్ పతకాలు అందించి గౌరవం తీసుకువచ్చింది. ఈ సందర్భంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ పెళ్లి వార్త మరో మైలురాయి అని చెప్పవచ్చు. సింధు వివాహం కార్యక్రమం చాలా సాంప్రదాయబద్ధంగా జరుగుతుందని సమాచారం. ఈ వేడుకల్లో తెలుగు సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. పెళ్లి తర్వాత ఆమె తన క్రీడా జీవితాన్ని కొనసాగిస్తుందా లేదా అన్నదానిపై స్ఫష్టత లేదు కానీ, అభిమానులు ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా అదే మద్దతు ఇస్తారని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా పీవీ సింధుకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె జీవితంలో ఈ కొత్త అధ్యాయం కూడా విజయవంతంగా సాగాలని ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..