PV Sindhu: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బ్యాడ్మింటన్ క్వీన్.. కాబోయే శ్రీవారితో పీవీ సింధు ఫొటోస్ వైరల్
హైదరాబాదీ బ్యాడ్మింటర్ స్టార్ పీవీ సింధు త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ఓ ఐటీ ప్రొఫెషనల్ తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించనుంది. తాజాగా పీవీ సింధు నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది.
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు త్వరలో తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. వెంకట దత్తసాయి అనే ఐటీ ప్రొఫెషనల్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది. తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాబోయే వధూ వరులు పీవీ సింధు, వెంకట దత్తసాయి ఉంగరాలు మార్చుకున్నారు. అలాగే ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం తమ ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘ఒకరి ప్రేమ మనకు దక్కిన సమయంలో.. తిరిగి మనం ప్రేమించాలి’ అని తన ఎంగేజ్ మెంట్ ఫొటోలకు క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది పీవీ సింధు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు సినీ, క్రీడా ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పీవీ సింధు వివాహ వేడుక ఈ నెల 22న రాజస్థాన్‌లో జరుగనుంది. ఈ విషయాన్ని సింధూ తండ్రినే ఇటీవల అధికారికంగా వెల్లడించాడు. ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో సింధూ వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత 24న హైదరాబాద్ లో రిసెప్షన్ కార్యక్రమం ఉంటుంది.
ఇక సింధుకు కాబోయే వరుడు విషయానికి వస్తే.. వెంకట దత్త సాయి హైదరాబాద్‌కు చెందిన ఒక ఐటీ ప్రొఫెషనల్. పొసిడెక్స్ టెక్నాలజీస్‌లో అతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. కాగా సింధు, వెంకట సాయి కుటుంబాలకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఇప్పుడు ఈ పెళ్లితో అది మరింత పటిష్ఠం కానుంది. జనవరి నుంచి సింధు వరుస టోర్నీలు ఆడనున్నది. అందుకే సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేయాలని భావించారు పీవీ సింధు తండ్రి. ఈ క్రమంలోనే డిసెంబర్ 22న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 20 నుంచి సింధు ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలుకానున్నాయి.
కాబోయే భర్తతో పీవీ సింధు..
View this post on Instagram
విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీకి భూమి పూజ చేస్తోన్న పీవీ సింధు..
View this post on Instagram
ఫ్యామిలీతో పీవీ సింధు..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..