Singapore Open Final: చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. తొలిసారి సింగపూర్ ఓపెన్ దక్కించుకున్న భారత స్టార్ షట్లర్
పీవీ సింధు వర్సెస్ వాంగ్ జి యి మధ్య జరిగిన సింగపూర్ ఓపెన్ బ్లాక్‌బస్టర్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో భారత దిగ్గజం ఘన విజయం సాధించింది.
PV Sindhu Vs Wang Zhi Yi Singapore Open Badminton 2022 Final: స్టార్ ఇండియన్ షట్లర్ సింగపూర్‌లో తన తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అలాగే సీజన్‌లో మూడవ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ క్లాష్‌లో పీవీ సింధు వాంగ్ జి యితో హోరాహోరీగా తలపడి, మూడు సెట్లలో రెండింటిని గెలుచుకుని, తన సత్తా చాటింది. పీవీ సింధు 21-9, 11-21, 21-15 స్కోరుతో వాంగ్ జి యిని ఓడించి సింగపూర్‌లో ఓపెన్‌లో సత్తా చాటింది. కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్‌లలో గెలిచిన తర్వాత 2022లో మూడవ టైటిల్‌ను కైవసం చేసుకుని, రికార్డ్ నెలకొల్పింది. 13 వరుస పాయింట్లను గెలుచుకోవడంతో పాటు ప్రారంభ గేమ్‌ను ముగించడానికి సింధుకు కేవలం 12 నిమిషాలే పట్టింది. అయితే వాంగ్ ఝీ రెండో గేమ్‌ను సాధించడంతో సమం చేసేందుకు అద్భుతమైన రీతిలో పోరాడింది. విరామ సమయంలో ఆమె ఐదు పాయింట్ల ఆధిక్యాన్ని పొందే సమయంలో సింధు.. మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. చైనీస్ ప్లేయర్ ఫైట్‌బ్యాక్ చేయాలని చూసినా.. భారత స్టార్ షట్లర్ ఏ దశలోనూ వెనక్కు తగ్గలేదు. దీంతో చైనీస్ ప్లేయర్‌కు ఓటమి తప్పలేదు.
Shuttler PV Sindhu wins her maiden Singapore Open title by defeating China’s Wang Zhi Yi
ఇవి కూడా చదవండి(file pic) pic.twitter.com/I74tU8Yoc2
— ANI (@ANI) July 17, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..