Wimbledon 2021: ఓపెన్ ఎరాలో తొలి వ్యక్తిగా స్విట్జర్లాండ్ దిగ్గజం.. 39 ఏళ్ల వయసులో అరుదైన రికార్డు..!
స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్.. 39 ఏళ్ల వయసులో అరుదైన ఘనత సాధించాడు. 39 ఏళ్ల వయసులో ఓపెన్ ఎరాలో క్వార్టర్స్ కు చేరిన తొలి ఆటగాడిగా రికార్డులు సృష్టించాడు.
Wimbledon 2021: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్.. 39 ఏళ్ల వయసులో అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటికే అత్యధిక గ్రాండ్ స్లామ్ (20) లు సాధించి రికార్డులతో దూసుకపోతున్న ఈ ఆటగాడు.. వింబుల్డన్ ఓపెన్ ఎరాలో క్వార్టర్స్ కు చేరి మరో రికార్డును సాధించాడు. 39 ఏళ్ల వయసులో ఓపెన్ ఎరాలో క్వార్టర్స్ కు చేరిన తొలి ఆటగాడిగా రికార్డులు సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతోన్న వింబుల్డన్ 2021 టోర్నీలో ఈ స్విట్జర్లాండ్ దిగ్గజం.. ఇటలీకి చెందిన లోరెంజో సొనేగాపై విజయం సాధించి క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు. 1968లో ఓపెన్ ఎరా ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రస్తుత వింబుల్డన్ వరకు చూస్తూ.. క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న ఎక్కువ వయసు గల ఆటగాడిగా ఫెదరర్ చరిత్ర సృష్టించాడు. మరెవరికీ సాధ్యం కాని రికార్డును క్రియోట చేయండం ద్వారా తొలి ఆటగాడిగాను ఫెదరర్ రికార్డు క్రియోట్ చేశాడు. అయితే, ఫెదరర్ మరో 20 రోజుల్లో 40వ సంవత్సరంలోకి ఎంటర్ కాబోతున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నిన్న (సోమవారం) జరిగిన ప్రిక్వార్టర్స్ లో ఆరవ సీడ్ రోజర్ ఫెదరర్ 7-5, 6-4, 6-2తో ఇటలీ ఆటగాడు లోరెంజో సొనేగా పై అద్భుత విజయం సాధించాడు. కాగా, మోకాలికి సర్జరీ చేయడంతో.. ఇటీవలి కాలంలో ఫామ్‌ను కోల్పోయాడు ఈ స్విస్ దిగ్గజం. ప్రస్తుతం మంచి ఫాంలో గ్రాస్ కోర్టులో చెలరేగిపోతున్నాడు. ఈమేరకు 18వ సారి క్వార్టర్స్ కు చేరి రికార్డు క్రియోట్ చేశాడు. క్వార్టర్స్ లో ఫెదరర్.. హుబెర్ట్ హుర్కాజ్తో లేదా డానియల్ మెద్వెదెవ్తలపడే ఛాన్స్ ఉంది. మరోవైపు పురుషుల సింగల్స్ లో టాప్ సీడ్ జకోవిచ్, ఏడవ సీడ్ ఇటలీ ప్లేయర్ బెరెటిని, పదవ సీడ్ కెనడా ప్లేయర్ షపొవలోవ్, రష్యా ప్లేయర్ కచనోవ్, హంగేరి ప్లేయర్ ఫుక్సోవిచ్ లు కూడా ప్రీక్వార్టర్స్ పోరులో విజయం సాధించారు. మహిళల విభాగంలో టాప్ సీడ్ ఆష్లే బార్టీ, రెండవ సీడ్ బెలారస్ ప్లేయర్ సబలెంక, ట్యునీషియా ప్లేయర్ ఆన్స్ జబేర్, జర్మనీ ప్లేయర్ కెర్బర్, చెక్ ప్లేయర్ ముచోవా, స్విట్జర్లాండ్ ప్లేయర్ గొల్బిచ్ లు క్వార్టర్స్‌కు చేరారు.
Also Read: