News9 CBC 2025: నేటినుంచే న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. పూర్తి షెడ్యూల్ ఇదే..
The News9 Corporate Badminton Championship: న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025తో ఈవెంట్ నేటి నుంచి గచ్చిబౌలీలో మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో జరగనుంది. ఇందులో దేశ వ్యాప్తంగా కార్పొరేట్ ఉద్యోగులు పాల్గొననున్నారు. మే 9 నుంచి 11 వరకు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో 3 రోజుల పాటు ఈ న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 ఆకట్టుకోనుంది.

The News9 Corporate Badminton Championship: భారతదేశంలోని నెంబర్ 1 నెట్‌వర్క్ టీవీ9 ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా క్రీడల కోసం మరో కీలక అడుగు వేసింది టీవీ9 నెట్ వర్క. ఇప్పటికే గతేడాది కార్పొరేట్ ఫుట్‌బాల్ కప్, ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ ఫుట్‌బాల్ టోర్నమెంట్స్‌ను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఈవెంట్‌తో టీవీ9 నెట్ వర్క్ సిద్ధమైంది. న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025తో ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్ నేటి నుంచి గచ్చిబౌలీలో మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో జరగనుంది. ఇందులో దేశ వ్యాప్తంగా కార్పొరేట్ ఉద్యోగులు పాల్గొననున్నారు. మే 9 నుంచి 11 వరకు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో 3 రోజుల పాటు ఈ న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 ఆకట్టుకోనుంది.
మ్యాచ్ షెడ్యూల్..
ఈ ఉత్కంఠభరితమైన టోర్నమెంట్ అధికారిక మ్యాచ్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది. దిగువ లింక్‌ను క్లిక్ చేసి, పూర్తి షెడ్యూల్‌ను చెక్ చేసుకోవచ్చు.
మ్యాచ్ షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఈ ఈవెంట్ స్నేహాన్ని పెంపొందించడానికి, కార్పొరేట్ సంబంధాలను నిర్మించడానికి, నిపుణులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవడానికి ఒక ప్రత్యేకమైన వేదికను అందిస్తుంది.
వివరాలు మీకోసం..
ఈవెంట్: న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్
వేదిక: పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, గచ్చిబౌలి, హైదరాబాద్
ప్రారంభ తేదీ: 9వ-11వ మే 2025
పాల్గొనే గ్రూప్‌లు..
ఈ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌తో కూడిన ఓపెన్ కేటగిరీ ఉంటుంది. పురుషుల కేటగిరీ కింద, 3 నుంచి 5గురు ఆటగాళ్లతో కూడిన జట్టు లేదా స్క్వాడ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి కార్పొరేట్ సంస్థ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జట్లను నమోదు చేసుకోవచ్చు.
ప్రైజ్ వివరాలు..
పోటీతో పాటు, పాల్గొనేవారికి అద్భుతమైన ప్రయోజనం దక్కనుంది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగే పోటీలో విజేతగా నిలిచిన టీంపై కానుకల వర్షం కురవనుంది. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 1.50 లక్షలు, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 1 లక్ష, మూడవ స్థానంలో నిలిచిన జట్టుకు 50,000 రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




