Benjamin Mendy: ‘నాకు 10,000 మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయి’.. స్టార్ ఫుట్‌బాలర్ సంచలన వ్యాఖ్యలు..

2018లో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఫ్రెంచ్ జట్టులో మెండీ ఉన్న సంగతి తెలిసిందే. 28 ఏళ్ల ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఆటగాడు బెంజమిన్ మెండీ ఒక మహిళ ఫోన్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Benjamin Mendy: 'నాకు 10,000 మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయి'.. స్టార్ ఫుట్‌బాలర్ సంచలన వ్యాఖ్యలు..
Star Footballer Benjamin Mendy
Follow us
Venkata Chari

|

Updated on: Aug 20, 2022 | 8:54 PM

మాంచెస్టర్‌కి చెందిన స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు బెంజమిన్ మెండీ అత్యాచారం కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. ఓ మహిళపై అత్యాచారం చేశాడని మెండీపై ఆరోపణలు వచ్చాయి. ఇదే కాకుండా, మెండీపై మరో నలుగురు మహిళలు కూడా తమను అత్యాచారం చేసినట్లు ఆరోపణలు చేశారు. 2018లో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఫ్రెంచ్ జట్టులో మెండీ ఉన్న సంగతి తెలిసిందే. 28 ఏళ్ల ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఆటగాడు బెంజమిన్ మెండీ ఒక మహిళ ఫోన్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళను ట్రాప్ చేసిన తర్వాత, బెంజమిన్ ఆమెను తన పడకగదికి తీసుకెళ్లాడు. చెస్టర్ క్రౌన్ కోర్టు విచారణలో మెండీని అక్టోబర్ 2020లో ఒక బార్‌లో కలుసుకున్నట్లు సదరు మహిళ పేర్కొంది.

మెండీ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ సిటీ సహచరుడు జెస్సీ లింగార్డ్ కూడా బార్‌లో ఉన్నాడంట. దీంతో ఆ మహిళను మెండి రూరల్ చెషైర్‌లోని ఇంటికి తీసుకెళ్లారు. ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టులో తెలిపింది. మహిళ ప్రకారం- ఇంటికి చేరుకున్న తర్వాత, మెండీ తన వేలిముద్రతో బెడ్‌రూమ్ తలుపు తెరిచాడు. అప్పుడు మహిళ ఫోన్ మెండీ చేతిలో ఉంది. ఆ మహిళ తన ఫోన్‌ను తిరిగి ఇవ్వమని కోరుతూ మెండీ బెడ్‌రూమ్‌కి వెళ్లింది. బెడ్‌రూమ్‌లోకి వచ్చిన తర్వాత, డోర్ లాక్ చేసి ఉందని, ఇప్పుడు ఎక్కడికీ వెళ్లలేవంటూ మెండీ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో 10,000 మంది మహిళలతో సెక్స్ చేశాడని మెండీ చెప్పాడని, దాంతో తాను పదేపదే వద్దంటూ వేడుకున్నట్లు’ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మెండీ గురించి నీకెలా తెలుసు అని ఆ మహిళను పోలీసులు ప్రశ్నించగా.. ‘నేను బార్‌లో కలుసుకున్నట్లు’ పేర్కొంది. మెండీపై 5 మంది మహిళలు అత్యాచారం చేశారని ఆరోపించారు. అయితే స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మాత్రం ఈ విషయాలను కొట్టిపారేస్తున్నాడు. ఈ ఘటనలన్నీ మెండీ విలాసవంతమైన ఇంట్లోనే జరిగాయని కోర్టులో పేర్కొన్నారు. మెండీ ఇద్దరు టీనేజ్ బాలికలపై కూడా అత్యాచారం చేసినట్లు చెబుతున్నారు. ఈ అంశంపై ఇంకా కోర్టులో విచారణ కొనసాగుతోంది.