IND vs PAK: ఓ వైపు అక్తర్ బెదిరింపులు.. మరో వైపు అఫ్రిది డర్టీ లాంగ్వేజ్.. సచిన్ ఇచ్చిన ధీటైన సమాధానం ఇదీ..
2003 World Cup: ఇండో-పాక్ పోరుకు ముందు, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ICC పురుషుల ప్రపంచ కప్ 2003 గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. మైదానంలో భారత్, పాకిస్థాన్ జట్లు ముఖాముఖిగా తలపడినప్పుడు..
World Cup 2003: ఆసియా కప్ 2022కు అంతా సిద్ధమైంది. ఆగస్ట్ 28న ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ (IND vs PAK) తలపడనున్నాయి. వచ్చే మ్యాచ్‌కి ఇరు జట్లు రెడీ అవుతున్నాయి. ఇండో-పాక్ పోరుకు ముందు, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ICC పురుషుల ప్రపంచ కప్ 2003 గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. మైదానంలో భారత్, పాకిస్థాన్ జట్లు ముఖాముఖిగా తలపడినప్పుడు మ్యాచ్‌లో ఉత్కంఠ ఎలా పెరుగుతుందో చెప్పుకొచ్చాడు.
ఈ సంద్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ, 2003లో వరల్డ్ ఇండియా, పాకిస్థాన్ జట్లు సెంచూరియన్‌లో ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బ తీస్తానని షోయబ్ అక్తర్ ఒక ప్రకటనలో చెప్పిన విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. మేం అతని ప్రకటన వినకపోయినా, ఆ సమయంలో మాకు టీవీ లేదా వార్తాపత్రిక చదివే అవకాశం లభించలేదు’ అంటూ పేర్కొన్నాడు.
‘మ్యాచ్ సందర్భంగా అక్తర్ మొదటి ఓవర్‌తో మైదానానికి వచ్చాడు. సచిన్ తన మొదటి ఓవర్‌లో భీకరంగా బ్యాటింగ్ చేస్తూ 18 పరుగులు రాబట్టాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ చాలా అనుభవజ్ఞుడైన ప్లేయర్‌లా స్పందించాడు. ఎందుకంటే అతని ప్రదర్శన భారతదేశానికి నిజంగా ముఖ్యమైనదని అతనికి తెలుసు’ అంటూ ఈ డాషింగ్ బ్యాట్స్‌మెన్ చెప్పుకొచ్చాడు.
A ‘frenemies’ bond that will be remembered in the history ? as a classic! ?
Watch @virendersehwag & @shoaib100mph revisit their #GreatestRivalry ahead of the #INDvPAK ⚔️!#BelieveInBlue | #AsiaCup | Aug 28, 6 PM | Star Sports & Disney+Hotstar pic.twitter.com/FvXeA5IwaY
— Star Sports (@StarSportsIndia) August 18, 2022
“ఇది మాత్రమే కాదు, మ్యాచ్ సమయంలో, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా సచిన్‌ను నిరంతరం దుర్భాషలాడుతూ, సచిన్ దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తున్నాడు. అయినప్పటికీ, సచిన్ ఫీల్డ్‌లో తెలివిగా ఉండి, జట్టు విజయంలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు” అని పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు భారత్ ముందు ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అదే సమయంలో, ఈ లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు 26 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి సులభంగా విజయం సాధించింది. జట్టు తరపున సచిన్ 98 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు రాహుల్ ద్రవిడ్ 44, యువరాజ్ సింగ్ 50 నాటౌట్‌గా నిలిచారు.