Paris Olympics 2024: మొదలైన ఒలింపిక్స్ గేమ్స్.. ప్రారంభానికి ముందే షురూ.. ఎందుకో తెలుసా?

|

Jul 25, 2024 | 6:30 AM

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, అంతకు ముందు కొన్ని మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. దీని ప్రకారం జూలై 24 నుంచి ఫుట్‌బాల్, రగ్బీ టోర్నీ ప్రారంభం కానుంది. అలాగే, భారత్ తన ఒలింపిక్స్ ప్రచారాన్ని జులై 25న ఆర్చరీతో ప్రారంభించనుంది.

Paris Olympics 2024: మొదలైన ఒలింపిక్స్ గేమ్స్.. ప్రారంభానికి ముందే షురూ.. ఎందుకో తెలుసా?
Paris Olympics 2024
Follow us on

Paris Olympics 2024: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ ఈరోజు ప్రారంభం కానున్నాయి. జులై 26న క్రీడల ప్రారంభోత్సవం జరగాల్సి ఉన్నప్పటికీ కొన్ని టోర్నీలు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. దీని ప్రకారం ఫుట్ బాల్ మ్యాచ్‌తో పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా, మొరాకో జట్లు తలపడనున్నాయి.

ఓపెనింగ్‌కు ముందే మ్యాచ్‌లు ప్రారంభం.. ఎందుకంటే?

ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి ముందు టోర్నీని ప్రారంభించే సంప్రదాయం 1992లో మొదలైంది. బార్సిలోనా ఒలింపిక్స్‌లో తొలిసారిగా ప్రారంభోత్సవానికి ముందు కొన్ని మ్యాచ్‌లు జరిగాయి. ఆ తర్వాత ప్రతి ఒలింపిక్స్‌లోనూ ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

దీనికి ప్రధాన కారణం ప్లేయర్ రిలాక్సేషన్. అంటే ఫుట్‌బాల్, రగ్బీ, బాస్కెట్‌బాల్ వంటి క్రీడల్లో పోటీపడే ఆటగాళ్లకు ఎక్కువ విశ్రాంతి అవసరం. అందుకే ఒక మ్యాచ్‌కి మరో మ్యాచ్‌కి 48 గంటల విశ్రాంతి ఇచ్చేలా ఓపెనింగ్‌కు ముందు కొన్ని మ్యాచ్‌లను నిర్వహించే సంప్రదాయం మొదలైంది.

ఇవి కూడా చదవండి

మరో కారణం మైదానాలు. ఫుట్‌బాల్, రగ్బీ వంటి కొన్ని మ్యాచ్‌లు చాలా కాలం పాటు జరుగుతాయి. అంటే మొదటి రౌండ్, రెండవ రౌండ్, సెమీ-ఫైనల్, ఫైనల్ ఇలా.. జరుగుతుంటాయి. పురుషుల, మహిళల జట్ల మ్యాచ్‌లు కూడా ఇక్కడ నిర్వహించనున్నారు. అందుకే వరుస మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి మైదానాలు అవసరం. కాబట్టి ఫుట్‌బాల్‌తో సహా కొన్ని మ్యాచ్‌లు ఒలింపిక్స్‌లోని ఇతర మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు నిర్వహిస్తుంటారు.

దీర్ఘకాలిక టోర్నమెంట్..

ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రీ-ఓపెనింగ్ మ్యాచ్‌ల ఫలితాన్ని ఒక్క రోజు మ్యాచ్ ద్వారా నిర్ణయించలేం. అంటే ఇక్కడ పతకం ఎవరికి దక్కుతుందో జులై 24న ఖరారు కానుందన్నమాట. ఈక్రమంలో ప్రతి జట్టు ఒకదానికొకటి గ్రూప్‌ల్లో తలపడతాయి. దీని కారణంగా, ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు సుదీర్ఘ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

పారిస్ ఒలింపిక్స్ జూలై 24 షెడ్యూల్..

6:30 PM- ఫుట్‌బాల్ – అర్జెంటీనా vs మొరాకో

6:30 PM – ఫుట్‌బాల్ – ఉజ్బెకిస్తాన్ vs స్పెయిన్

7:00 PM – రగ్బీ సెవెన్స్ – ఆస్ట్రేలియా vs సమోవా

7:30 PM- రగ్బీ సెవెన్స్ – అర్జెంటీనా vs కెన్యా

8:00 PM – రగ్బీ సెవెన్స్ – ఫ్రాన్స్ vs యునైటెడ్ స్టేట్స్

8:30 PM – ఫుట్‌బాల్ – గినియా v న్యూజిలాండ్

8:30 PM – ఫుట్‌బాల్ – ఈజిప్ట్ vs డొమినికన్ రిపబ్లిక్

8:30 PM – రగ్బీ సెవెన్స్ – ఫిజీ vs ఉరుగ్వే

9:00 PM – రగ్బీ సెవెన్స్ – ఐర్లాండ్ vs సౌత్ ఆఫ్రికా

9:30 PM – రగ్బీ సెవెన్స్ – న్యూజిలాండ్ vs జపాన్

10:30 PM – ఫుట్‌బాల్ – ఇరాక్ vs ఉక్రెయిన్

10:30 PM – ఫుట్‌బాల్ – జపాన్ vs పరాగ్వే

10:30 PM – రగ్బీ సెవెన్స్ – ఆస్ట్రేలియా vs కెన్యా

11:00 PM – రగ్బీ సెవెన్స్ – అర్జెంటీనా vs సమోవా

11:30 PM – రగ్బీ సెవెన్స్ – ఫ్రాన్స్ vs ఉరుగ్వే

12:00 AM – రగ్బీ సెవెన్స్ – ఫిజీ vs యునైటెడ్ స్టేట్స్

12:30 AM – ఫుట్‌బాల్ – ఫ్రాన్స్ vs యునైటెడ్ స్టేట్స్

12:30 AM – ఫుట్‌బాల్ – మాలి vs ఇజ్రాయెల్

12:30 AM – రగ్బీ సెవెన్స్ – ఐర్లాండ్ vs జపాన్

01:00 AM – రగ్బీ సెవెన్స్ – న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..