AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinesh Phogat: వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు.. అసలేంటీ ఆ రూల్.. ఏకిపారేస్తోన్న నెటిజన్లు?

వినేష్ ఫోగట్ ఫైనల్ చూసేందుకు భారతదేశం సిద్ధమవుతున్న వేళ.. ఒక వార్త దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్యారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి వినేష్‌ ఫోగట్‌ ఔట్‌ అయిన వార్తతో అంతా షాక్ అయ్యారు. తుది పోరుకు ముందే అనర్హుడయ్యాడు. వినేష్ బరువు ఆమె వెయిట్ కేటగిరీ కంటే కొంచెం ఎక్కువగా ఉందని, దీంతో ఆమె అనర్హత వేటు పడిందని వార్తలు వచ్చాయి.

Vinesh Phogat: వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు.. అసలేంటీ ఆ రూల్.. ఏకిపారేస్తోన్న నెటిజన్లు?
Vinesh Phogat
Venkata Chari
|

Updated on: Aug 07, 2024 | 1:58 PM

Share

వినేష్ ఫోగట్ ఫైనల్ చూసేందుకు భారతదేశం సిద్ధమవుతున్న వేళ.. ఒక వార్త దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్యారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి వినేష్‌ ఫోగట్‌ ఔట్‌ అయిన వార్తతో అంతా షాక్ అయ్యారు. తుది పోరుకు ముందే అనర్హత వేటు పడింది. వినేష్ బరువు ఆమె వెయిట్ కేటగిరీ కంటే కొంచెం ఎక్కువగా ఉందని, దీంతో ఆమెపై అనర్హత వేటు పడిందని వార్తలు వచ్చాయి. అంటే, ప్యారిస్ ఒలింపిక్స్‌లో గెలిచిన తర్వాత కూడా వినేష్ ఫోగట్ ఓడపోయిందన్నమాట.

బరువు పెరిగిన వినేష్‌పై అనర్హత, రూల్ ఏంటో తెలుసా?

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, రెజ్లర్ల బరువు విభాగానికి సంబంధించిన నియమం ఏమిటి, దీని కారణంగా మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరుకున్న తర్వాత కూడా వినేష్ ఫోగట్‌ను పారిస్ ఒలింపిక్స్ నుంచి  తప్పుకోవాల్సి వచ్చింది? రెజ్లింగ్‌కు సంబంధించిన నిబంధనల ప్రకారం, ఏ రెజ్లర్ అయినా మ్యాచ్ జరిగే రెండు రోజులూ తన వెయిట్ కేటగిరీలోనే ఉండాలి. కానీ, వినేష్ ఫోగట్ బరువు ఆమె కేటగిరీ కంటే 150 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెను అనర్హుడిగా ప్రకటించారు.

వినేష్‌కి ఎలాంటి పతకం రాదు..

నివేదికల ప్రకారం, సాయంత్రం రెజ్లింగ్ మ్యాచ్ నిర్వహిస్తే, మ్యాచ్ జరిగే రోజు ఉదయం రెజ్లర్ బరువును తూకం వేస్తారు. ఒక రెజ్లర్ తన బరువు కేటగిరీ నుంచి గరిష్టంగా 100 గ్రాముల బరువును పెంచుకోవడానికి అనుమతిస్తారు. కానీ, వినేష్ విషయంలో మాత్రం 100 గ్రాముల కంటే కొద్దిగా ఎక్కువగా ఉందంట. బరువు పెరిగిన కారణంగా వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌కు అనర్హత వేటు పడింది. దీంతో ఆమెకు ఇప్పుడు ఎలాంటి పతకం రాదు. నిబంధనల ప్రకారం ప్యారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల బరువు విభాగంలో కాంస్య, బంగారు పతకాలు మాత్రమే ఇస్తారు. వినేష్ ఔట్ కావడంతో రజత పతకం లభించదు.

గెలిచినా తర్వాత ఓడిపోయిన వినేష్ ఫోగట్..

పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల 50 కిలోల ఈవెంట్‌లో వినేష్‌ ఫోగట్‌ శుభారంభం చేసింది. ఆమె తన మొదటి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్‌ను ఓడించింది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్స్‌లోనూ దిగ్గజాలకు షాకిస్తూ ఫైనల్‌కు ప్రయాణం సాగించింది. కానీ, ఇప్పుడు పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి ఔట్‌ అయిన తీరు.. గెలిచుకుంటూ ఫైనల్ వరకు వచ్చిన ఆమెకు తీవ్రమైన బాధను మిగిల్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు