KIUG 2022: మొదలైన ఖేలో ఇండియా సంబురం.. 10 రోజులు.. 3000 మంది క్రీడాకారులు.. 20 ఈవెంట్స్‌లో పోటీలు..

ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఆయనతోపాటు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

KIUG 2022: మొదలైన ఖేలో ఇండియా సంబురం.. 10 రోజులు.. 3000 మంది క్రీడాకారులు.. 20 ఈవెంట్స్‌లో పోటీలు..
Khelo India University Games 2022
Follow us
Venkata Chari

|

Updated on: Apr 24, 2022 | 4:59 PM

ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్(Khelo India University Games) ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Vice President M Venkaiah Naidu) ప్రారంభించారు. ఆయనతోపాటు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag thakur) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో కర్ణాటక గవర్నర్ థావహర్ చంద్ గెహ్లాట్ కూడా పాల్గొన్నారు. 2020లో ముందుగా భువనేశ్వర్‌లో యూనివర్సిటీ గేమ్స్‌ను నిర్వహించారు. దీని తరువాత కరోనా కారణంగా గత సంవత్సరం నిర్వహించలేదు. ప్రస్తుతం రెండో సీజన్ నిర్వహిస్తున్నారు.

భారతదేశంలో కరోనా విలయం తర్వాత, దేశంలో నిర్వహించే మొదటి అతిపెద్ద క్రీడా కార్యక్రమం ఇదే కావడం విశేషం. 3000 కంటే ఎక్కువ మంది పాల్గొనేవారు ఈ గేమ్స్.. 10 రోజుల పాటు జరగనున్నాయి. ఇందులో సుమారు 189 విశ్వవిద్యాలయాలు పోటీపడనున్నాయి. అలాగే 20 క్రీడలలో టైటిల్స్ కోసం వీరంతా పోటీ పడనున్నారు.