AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indonesia Masters: పదో నంబర్ ఆటగాడికి షాకిచ్చిన లక్ష్య సేన్.. శుభారంభం చేసిన పీవీ సింధు..!

మంగళవారం జరిగిన ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్‌లో భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి రౌండ్ మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. ప్రపంచ నంబర్ -10 ర్యాంక్ ప్లేయర్ కెంటా సెన్యామాను ఓడించాడు.

Indonesia Masters: పదో నంబర్ ఆటగాడికి షాకిచ్చిన లక్ష్య సేన్.. శుభారంభం చేసిన పీవీ సింధు..!
Indian Badminton Players
Venkata Chari
|

Updated on: Nov 16, 2021 | 8:11 PM

Share

Indonesia Masters Badminton Tournament: మంగళవారం జరిగిన ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్‌లో భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి రౌండ్ మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. ప్రపంచ నంబర్ -10 ర్యాంక్ ప్లేయర్ కెంటా సెన్యామాను ఓడించాడు. మహిళల సింగిల్స్ విభాగంలోనూ భారత్‌కు శుభవార్త అందింది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు కూడా తొలి రౌండ్ హర్డిల్‌పై విజయంతో శుభారంభం చేసింది. హైలో ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్‌లో సెమీ-ఫైనల్, డచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన అల్మోరాకు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్, ఉత్కంఠభరితమైన పోటీలో కెంటాపై 21-17 18-21 21-17 తేడాతో ఓడించాడు. ఒక గంట ఎనిమిది నిమిషాల పాటు వీరి ఆట కొనసాగింది.

మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో మూడో సీడ్‌, డిఫెండింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌ సింధు థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి సుపానిడా కెత్థాంగ్‌పై 43 నిమిషాల్లో 21-15, 21-19 తేడాతో విజయం సాధించింది. ఆమె రెండో రౌండ్‌లో స్పెయిన్‌కు చెందిన క్లారా అజుర్మెండితో తలపడనుంది. లక్ష్య తదుపరి టాప్ సీడ్, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జపాన్‌కు చెందిన కెంటో మొమోటాతో తలపడనున్నాడు.

సింధు మ్యాచ్‌ కూడా అలాంటిదే.. తొలి గేమ్‌లో సుపనిదాను ఓడించేందుకు సింధుకు పెద్దగా కష్టాలు తప్పలేదు. విరామం వరకు 11-5తో ఆధిక్యంలో ఉన్న భారత ప్లేయర్ విరామం తర్వాత కూడా ప్రత్యర్థి ఆటగాడికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రెండో గేమ్‌లో సుపానిడా మెరుగ్గా ఆడింది. విరామం వరకు సింధు 11-8తో ఆధిక్యంలోకి వెళ్లినా థాయ్‌లాండ్ ప్లేయర్ పెద్దగా ఆధిక్యం సాధించలేకపోయింది. సింధు 19-18 స్కోరుతో రెండు మ్యాచ్ పాయింట్లు సాధించింది. సుపానీడా మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుంది. అయితే మరోవైపు సింధు గేమ్‌ను గెలుచుకుంది.

అత్యుత్తమ ఆట తీరుతో ఆకట్టుకున్న లక్ష్య‌సేన్.. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య తన కంటే మెరుగైన ర్యాంక్ ఆటగాడిని ఓడించాడు. తొలి గేమ్‌లో 6-9తో ఓడి 13-11తో ఆధిక్యంలోకి వెళ్లాడు. భారత ఆటగాడు 14-13 స్కోరు వద్ద వరుసగా నాలుగు పాయింట్లు సాధించి, ఆపై మొదటి గేమ్‌ను తన ఖాతాలో ఉంచుకున్నాడు. రెండో గేమ్‌లో, లక్ష్య 4-0 ఆధిక్యంలోకి వచ్చాడు. అయితే కెంటా 10-8 స్కోరుతో పునరాగమనం చేశాడు. విరామ సమయానికి లక్ష్య 11-10తో ఆధిక్యంలో ఉన్నాడు. 14-14 స్కోరు తర్వాత మెరుగైన ప్రదర్శన చేసిన జపాన్ ఆటగాడు మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు.

నిర్ణయాత్మక గేమ్‌లో, లక్ష్య మానసిక బలాన్ని ప్రదర్శించాడు. 3-6 తర్వాత, వరుసగా ఆరు పాయింట్లతో 13-8 ఆధిక్యాన్ని పొందాడు. కెంటా 16-16తో సమం చేశాడు. అయితే లక్ష్య తదుపరి ఆరు పాయింట్లలో ఐదు గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు.

Also Read: IND vs NZ 1st T20: ఆ ప్లేయర్‌ను ఆల్‌రౌండర్‌గా మార్చేందుకు హెడ్‌ కోచ్‌ ద్రవిడ్ స్కెచ్.. స్పెషల్ చిట్కాలతో నెట్స్‌లో ప్రాక్టీస్

India Vs New Zealand 2021: ఇక నుంచి విరాట్ కోహ్లీ స్థానం అదే: తేల్చి చెప్పిన భారత టీ20 సారథి

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...