Sumit Malik fine: డోప్ పరీక్షలో దొరికిపోయిన భారత రెజ్లర్ సుమీత్ మలిక్‌‌కు భారీ ఫైన్.. రూ.16 లక్షల జరిమానా పడే ఛాన్స్

Tokyo Olympics: డోప్‌ పరీక్షలో దొరికిపోయి టోక్యో ఒలింపిక్స్‌కు దూరమయ్యే ప్రమాదంలో పడ్డ భారత రెజ్లర్‌ సుమీత్‌ మలిక్‌ ఆర్థికంగా కూడా నష్టపోనున్నాడు. సుమీత్ బల్గేరియాలోని సోఫియాలో..

Sumit Malik fine: డోప్ పరీక్షలో దొరికిపోయిన భారత రెజ్లర్ సుమీత్ మలిక్‌‌కు భారీ ఫైన్.. రూ.16 లక్షల జరిమానా పడే ఛాన్స్
Sumit Malik
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 06, 2021 | 10:08 AM

టోక్యో ఒలింపిక్స్‌కు రెడీ అవుతున్న భారత్‌కు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. భారత రెజ్లర్ ఒకరు డోపింగ్ టెస్టులో దొరికిపోయాడు. అంతే కాదు అతడిపై భారీ జరిమానా పడే ఛాన్స్ కనిపిస్తోంది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిర్వహించన డోప్ టెస్టులో హరియాణాకు చెందిన రెజ్లర్ సుమీత్ దొరికిపోయాడు. ఇది భారత ఒలింపిక్ రెజ్లర్ జట్టుకు పెద్ద అడ్డంకిగా మారనుంది.

డోప్ పరీక్షలో విఫలమైన భారత రెజ్లర్ ​సుమీత్ మలిక్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య రూ.16 లక్షల జరిమానా విధించనుంది. ఈ మొత్తాన్ని అంతర్జాతీయ సమాఖ్యకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు మరో సుమీత్‌పై మరో ఆర్ధిక పిడుగు పడనుంది. గతంలో ఒలింపిక్స్​ కోసం హరియాణా క్రీడల విభాగం ఇచ్చిన రూ. 5 లక్షలు కూడా తిరిగి వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది.

డోప్‌ పరీక్షలో దొరికిపోయి టోక్యో ఒలింపిక్స్‌కు దూరమయ్యే ప్రమాదంలో పడ్డ భారత రెజ్లర్‌ సుమీత్‌ మలిక్‌ ఆర్థికంగా కూడా నష్టపోనున్నాడు. సుమీత్ బల్గేరియాలోని సోఫియాలో జరిగిన అంతర్జాతీయ 125కేజీ ఈవెంట్‌ సందర్భంగా నిర్వహించిన డోప్‌ పరీక్షలో విఫలమైనందున భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI).. అంతర్జాతీయ సమాఖ్యకు రూ.16 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

డబ్ల్యూఎఫ్‌ఐ తన విధానం ప్రకారం డోపీగా తేలిన రెజ్లర్‌ నుంచి ఆ మొత్తం జరిమానాను వసూలు చేస్తుంది. అంతే కాదు.. ఒలింపిక్స్‌కు సన్నద్ధం కోసం గత నెలలో హరియాణా క్రీడల విభాగం తనకు చెల్లించిన రూ.5 లక్షలను కూడా సుమీత్‌ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Tirumala heavy rain: తిరుమలలో ఎడతెరపిలేని వర్షం.. మొదటి ఘాట్ రోడ్డులో నేల కూలిన వృక్షం

విశాఖ ఖాకీల జులుం.. ప్రశ్నించినందుకు యువతిపై విచక్షణ రహితంగా దాడి