Asian Games 2023: రజతం పట్టిన పారుల్ చౌదరి.. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో సరికొత్త రికార్డ్ నమోదు..

Parul Chaudhary, Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌలో సోమవారం జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పారుల్ చౌదరి రజత పతకం సాధించింది. పారుల్ 9:27.63 సెకన్లతో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, బహ్రెయిన్‌కు చెందిన విన్‌ఫ్రెడ్ యావీ, 9:18.28 సెకన్లలో ఆమె స్వర్ణ పతకాన్ని విజయవంతంగా డిఫెండర్ చేసి, సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.

Asian Games 2023: రజతం పట్టిన పారుల్ చౌదరి.. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో సరికొత్త రికార్డ్ నమోదు..
Parul Chaudhary

Updated on: Oct 02, 2023 | 5:50 PM

Asian Games 2023, Parul Chaudhary: చైనాలోని హాంగ్‌జౌలో సోమవారం జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పారుల్ చౌదరి రజత పతకాన్ని గెలుచుకుంది. అలాగే, ప్రీతి మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది.

పారుల్ 9:27.63 సెకన్లతో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, బహ్రెయిన్‌కు చెందిన విన్‌ఫ్రెడ్ యావీ, 9:18.28 సెకన్లలో ఆమె స్వర్ణ పతకాన్ని విజయవంతంగా డిఫెండర్ చేసి, సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.

ఇవి కూడా చదవండి

ప్రీతి, 9:43.32 సెకన్లతో కొత్త వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో నిలిచింది. మూడో స్థానం కోసం బహ్రెయిన్‌కు చెందిన టైగెస్ట్ గెటెంట్ మెకోనెన్ (9:43.71 సెకన్లు)ను ఓడించగలిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..