Neeraj Chopra: నీరజ్‌ను చెత్త ప్రశ్నలతో విసిగిస్తోన్న నిర్వాహకులు.. నవ్వుతూ తిరస్కరించిన గోల్డెన్ బాయ్

Venkata Chari

Venkata Chari |

Updated on: Sep 07, 2021 | 12:09 PM

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ అయింది. దీనిపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలతో ఎందుకు విసిగిస్తారంటూ ఆగ్రహించారు.

Neeraj Chopra: నీరజ్‌ను చెత్త ప్రశ్నలతో విసిగిస్తోన్న నిర్వాహకులు.. నవ్వుతూ తిరస్కరించిన గోల్డెన్ బాయ్
Neeraj Chopra

Follow us on

Neeraj Chopra: ఆగస్టులో ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌ 2020లో జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి భారత్‌లో నీరజ్ చోప్రా పెద్ద స్టార్‌‌గా మారిపోయాడు. యువతకు ఆదర్శంగా మారాడు. ఆధునిక ఒలింపిక్స్‌ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ అథ్లెటిక్స్‌లో ఒక్క పతకం కూడా సాధించలేదు. నీరజ్ చోప్రా ఆలోటును భర్తీ చేశాడు. ఫైనల్ పోరులో 87.58 మీటర్ల దూరం బరిసెను విసిరి బంగారు పతకం దక్కించుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో నీరజ్ చోప్రాను ఇంటర్వ్యూల పేరుతో పలు ఇబ్బందికర ప్రశ్నలు అడగడంపై సోషల్ మీడియా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. జపాన్ నుంచి బంగారు పతకంతో తిరిగొచ్చిన నీర‌జ్ చోప్రాను ముంబైకి చెందిన రెడ్ ఎఫ్ఎమ్ ఇంట‌ర్వ్యూ చేసింది. పాపుల‌ర్ ఆర్జే మ‌లిష్కా మెండోన్సా వీడియో కాల్ ద్వారా గోల్డెన్ బాయ్‌తో మాట్లాడింది. ఈ ఇంటర్య్వూలోనే తను హగ్‌ కూడా అడిగింది. దీంతో నెటిజన్లు ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు. రెడ్ ఎఫ్‌ఎమ్ నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ కూడా చేశారు.

ఇటీవల ఒక ఆంగ్ల మీడియా నీరజ్‌ చోప్రాను ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ చేసింది. ఆయన వ్యక్తిగత , క్రీడా జీవితానికి సంబంధించిన పలు ప్రశ్నలతో నీరజ్ చోప్రాను విసిగించారు. ఈ క్రమంలో చరిత్రకారుడు రాజీవ్‌ సేథీ నీరజ్‌తో మాట్లాడుతూ.. ‘అందమైన కుర్రాడివి. నీ సెక్స్‌ లైఫ్‌ను, క్రీడా జీవితాన్ని ఎలా బ్యాలెన్స్‌ చేసుకొంటున్నావు?’ అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ ప్రశ్నతో అవాక్కైన నీరజ్ చోప్రా.. చాలా కూల్‌గానే స్పందించారు. ‘సారీ సర్‌’ అంటూ సమాధానం ఇచ్చాడు. అయినా సరే రాజీవ్‌ సేథీ మరలా మరలా అదే ప్రశ్న అడిగాడు. దీంతో ప్రతీసారి కూడా నీరజ్‌ సహనం కోల్పోకుండా ‘ప్లీజ్‌ సర్‌, సారీ సర్’ అంటూ జవాబిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ అయింది. దీనిపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలతో ఎందుకు విసిగిస్తారంటూ ఆగ్రహించారు.

అలాగే రాజీవ్ సేథి వైఖ‌రిని చాలా మంది ప్ర‌ముఖులు కూడా ఖండించారు. ఈ వీడియోకు శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ… ‘చెత్త ప్రశ్నలకు కూడా హుందాగా సమధానం చెప్పిన నీరజ్‌ చోప్రాపై నాకు గౌరవం మరింత పెరిగింది. నిజమైన స్పోర్ట్స్‌ పర్సన్‌’ అంటూ బాసటగా నిలిచింది. అలాగే మరికొంత మంది ప్రముఖులు కూడా ఈ విషయంపై ఘాటుగానే విమర్శించారు. నీరజ్ ఐకాన్ అన్న విషయాన్ని గౌరవించాలి. ఇలాంటి ప్రశ్నలు ఇకనైనా ఆపాలంటూ కామెంట్లు చేశారు.

కాగా, నీరజ్‌ చోప్రా మొదటి నుంచి వివాదాస్పద ప్రశ్నలకు దూరంగానే ఉంటాడు. ఇంటర్వ్యూల్లోనూ హుందాగా మాట్లాడేందుకు ఇష్టపడతాడు. ఇందుకు తాజా సంఘటనే చక్కని ఉదాహరణగా నిలిచింది. అలాగే రెండేళ్ల క్రితం ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలోనూ ఇలాంటి సంఘటనే ఎదురైంది. ‘నీకు ఇష్టమైన హీరోయిన్‌ ఎవరు’ అని అడిగిన ప్రశ్నకు రెండు చేతులు జోడించి సోదరా.. ఇలాంటి ప్రశ్నలు అడగవద్దంటూ నవ్వుతూ సమధానమిచ్చాడు. సెలబ్రిటిలుగా మారిన వ్యక్తుల పర్సనల్ లైఫ్ విషయాలను పదే పదే ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తున్న కొందరిపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అలాంటి వారితో కొంచెం హుందాగా వ్యవహరించండంటూ సూచించారు.

Also Read: Virat kohli-Ravi Shastri: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్తి, కెప్టెన్ కోహ్లీపై బీసీసీఐ ఆగ్రహం.. ఎందుకో తెలుసా?

తొలి వన్డేలో అమెరికా ఘన విజయం.. కేవలం 28 ఓవర్లలోనే ఫలితం.. ఈ భారత స్పిన్నరే కారణం.. ఆయనెవరో తెలుసా?

Virat Kohli-Ashwin: అశ్విన్‌ను అందుకే పక్కన పెట్టాం..! అసలు విషయం చెప్పిన టీమిండియా కెప్టెన్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu