FIFA World Cup 2022: నేటి నుంచి ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్‌ పైనల్స్.. రాత్రి 8.30గంటలకు బ్రెజిల్‌తో క్రొయేషియా మ్యాచ్‌..

సాకర్‌ అభిమానులకు ఇది సూపర్‌ ఫ్రైడే. నేటి నుంచి ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్‌ పైనల్స్ ప్రారంభం కానుంది. నెమార్‌, మెస్సీలు తమ ఆటతో కిక్కెక్కించనున్నారు.

FIFA World Cup 2022: నేటి నుంచి ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్‌ పైనల్స్.. రాత్రి 8.30గంటలకు బ్రెజిల్‌తో క్రొయేషియా మ్యాచ్‌..
Football World Cup 2022

Updated on: Dec 09, 2022 | 7:36 AM

సాకర్‌ అభిమానులకు ఇది సూపర్‌ ఫ్రైడే. నేటి నుంచి ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్‌ పైనల్స్ ప్రారంభం కానుంది. నెమార్‌, మెస్సీలు తమ ఆటతో కిక్కెక్కించనున్నారు. ఇవాళ జరిగే తొలి క్వార్టర్స్‌లో క్రొయేషియాతో బ్రెజిల్‌ అమీతుమీ తేల్చుకోనుండగా.. అర్ధరాత్రి జరిగే రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను అర్జెంటీనా ఢీ కొట్టనుంది. ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్‌.. ఆరో కప్‌ వేటలో టాప్‌ గేర్‌లో సాగుతోంది. తొలి క్వార్టర్‌ఫైనల్లో బ్రెజిల్‌ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. గత టోర్నీ రన్నరప్‌ క్రొయేషియాను ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. గాయం నుంచి కోలుకొని నెమార్‌ రీఎంట్రీ ఇవ్వగా.. రిచర్లిసన్‌, వీనీసియస్‌ లాంటి ఉడుకు రక్తంతో బ్రెజిల్‌ దూకుడుగా కనిపిస్తోంది.

మరోవైపు వెటరన్‌ ఆటగాళ్లతో క్రొయేషియా కొంత కష్టంగా క్వార్టర్స్‌ బెర్త్‌ దక్కించుకొంది. మోద్రిచ్‌ కేంద్రకంగా జట్టు ఆట సాగుతున్నా.. అటాకింగ్‌ బలహీనంగా ఉంది. వరల్డ్‌కప్‌లో ఇరుజట్లూ రెండుసార్లు తలపడగా.. రెండింటిలోనూ బ్రెజిల్‌ నెగ్గింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..