AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CRO vs BRA: ఐదుసార్ల ఛాంపియన్‌కు ఘోర పరాభవం.. ప్రత్యర్థి గోల్‌ కీపర్ ఇచ్చిన షాక్‌తో ఇంటిబాట..

FIFA World Cup 2022 Croatia Vs Brazil: పెనాల్టీ షూట్ అవుట్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా క్రొయేషియా బలమైన టైటిల్ పోటీదారు బ్రెజిల్‌ను ఇంటికి పంపింది.

CRO vs BRA: ఐదుసార్ల ఛాంపియన్‌కు ఘోర పరాభవం.. ప్రత్యర్థి గోల్‌ కీపర్ ఇచ్చిన షాక్‌తో ఇంటిబాట..
Cro Vs Bra
Venkata Chari
|

Updated on: Dec 10, 2022 | 6:48 AM

Share

FIFA World Cup 2022 Croatia Vs Brazil: ఖతార్ ప్రపంచ కప్‌లో మొదటి క్వార్టర్ ఫైనల్స్‌లో, క్రొయేషియా జట్టు ఎంతో ఉత్కంఠ మధ్య సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించింది. దాదాపు 115 నిమిషాల పోరాటం తర్వాత చివరి 15-16 నిమిషాలలో వేలాది మంది ప్రేక్షకుల మధ్య ఓ అకస్మాత్తు గోల్‌ని చూశారు. అయితే చివరికి మాత్రం విన్నర్ పెనాల్టీలో నిర్ణయమైంది. ఇక్కడ ఐదుసార్లు ఛాంపియన్ బ్రెజిల్ నిరాశపరిచింది. దీంతో ఆరోసారి ప్రపంచకప్ గెలవాలన్న బ్రెజిల్ కల మరోసారి నిరాశగానే మిగిలింది.

నిర్ణీత 90 నిమిషాలకు మ్యాచ్ 0–0తో కొనసాగింది. అదనపు సమయం ముగిసేసరికి స్కోరు 1–1తో ముగిసింది. ఇటువంటి పరిస్థితిలో, విషయం పెనాల్టీకి చేరుకుంది. ప్రపంచకప్ చరిత్రలో నాలుగోసారి పెనాల్టీ షూటౌట్‌కు చేరుకున్న క్రొయేషియా ఇక్కడ నాలుగోసారి విజయం సాధించింది. బ్రెజిల్‌కు తొలి పెనాల్టీలో రోడ్రిగో కొట్టిన షాట్‌ను అడ్డుకోవడం ద్వారా క్రొయేషియా కీపర్ డొమినిక్ లివ్‌కోవిచ్ జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత వచ్చిన రెండు పెనాల్టీలను ఇరు జట్లు గోల్‌గా మార్చుకున్నాయి.

అనుభవం పని చేయలేదు..

క్రొయేషియా వరుసగా నాలుగో పెనాల్టీని స్కోర్ చేసింది. ఇటువంటి పరిస్థితిలో అనుభవజ్ఞుడైన డిఫెండర్ మార్క్వినోస్ పెనాల్టీని నిర్ణయించవలసి వచ్చింది. సెమీ-ఫైనల్స్‌లో తమ స్థానాన్ని బుక్ చేసుకోవడానికి 4-2తో షూటౌట్‌ను గెలుచుకున్న క్రొయేషియా ఆటగాళ్లు మొత్తం తమ గోల్‌కీపర్ వైపు పరుగులు తీశారు.

ఇవి కూడా చదవండి

బలమైన దాడి, కానీ గోల్స్ లేవు..

డిసెంబర్ 9 శుక్రవారం ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంలో జరిగిన టోర్నమెంట్‌లో చివరి-8 మొదటి మ్యాచ్‌లో ఐదుసార్లు ఛాంపియన్ బ్రెజిల్, చివరి ప్రపంచ కప్ రన్నరప్ క్రొయేషియా ముఖాముఖిగా తలపడ్డాయి. బ్రెజిల్ తమ చివరి మ్యాచ్‌లో దక్షిణ కొరియాను 4-1తో ఓడించి ఇక్కడకు చేరుకోగా, ఎక్స్‌ట్రా టైమ్‌లో లక్ కలిసిస్తోన్న క్రొయేషియా.. పెనాల్టీ షూటౌట్‌లో జపాన్‌ను ఓడించింది. దూకుడు శైలి, వ్యూహాత్మక ఆటతో బ్రెబిల్‌ను ఓడించింది.

అద్భుతమైన ఎటాకర్లతో నిండిన బ్రెజిల్ ఆరంభం నుంచి మరింత దూకుడుగా ఆడుతూ క్రొయేషియా డిఫెన్స్ ను చీల్చేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. అనేక షాట్లు కూడా అడ్డుకున్నా.. క్రొయేషియా డిఫెన్స్, ముఖ్యంగా గోల్ కీపర్ డొమినిక్ లివ్కోవిచ్, బ్రెజిల్ దాడిని అడ్డుకున్నారు. క్రొయేషియా కూడా ఎన్నో అవకాశాలను సృష్టించింది. కానీ, అది కూడా విజయం సాధించలేదు. ఈ ప్రయత్నాలలో, మొదటి సగం, రెండవ సగం కూడా గడిచిపోయింది. మొత్తం 90 నిమిషాల్లో (+ ఇంజూరీ సమయం) ఎటువంటి గోల్ చేయలేదు.

నెయ్‌మార్‌ మ్యాజిక్‌..

ఇటువంటి పరిస్థితిలో, మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపించింది. ఇక్కడ కూడా బ్రెజిల్ దాడి కొనసాగింది. కానీ, విజయవంతం కాలేదు. ఆ తర్వాత ఎక్స్‌ట్రా టైమ్‌ తొలి అర్ధభాగంలో చివరి నిమిషంలో బ్రెజిల్‌ సూపర్‌స్టార్‌ నేమార్‌ జూనియర్‌ మ్యాజిక్‌ను ప్రదర్శించారు. క్రొయేషియా బాక్స్‌లోకి ప్రవేశించిన నేమార్ మిడ్‌ఫీల్డర్ పక్వెటాతో కలిసి ఒక ఎత్తుగడ వేసి డిఫెన్స్‌లోకి చొచ్చుకుపోవడంలో సఫలమయ్యాడు.

ఆపై, కీపర్‌ను తప్పించి, గోల్ లోపల బంతిని పంపి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. దీంతో గ్రేట్ పీలే పేరిట ఉన్న 77 గోల్స్ బ్రెజిల్ రికార్డును నెయ్‌మార్ సమం చేశాడు.

క్రొయేషియా మెరుపులు..

ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న బ్రెజిల్‌ రెండో గోల్‌ కోసం కూడా కన్నేసింది. 117వ నిమిషంలో మ్యాచ్ బ్రెజిల్ చేతుల్లోకి వెళ్లబోతోందని భావించిన సమయంలో, బ్రూనో పెట్‌కోవిక్ గోల్ మధ్యలో నుంచి కొట్టిన షాట్ బ్రెజిల్ డిఫెండర్‌ను పక్కకు తప్పించి గోల్‌లోకి వెళ్లడంతో బ్రెజిల్ మ్యాచ్‌ను సమం చేసింది. చివరికి పెనాల్టీకి చేరిన ఫలితం.. ఇక్కడ క్రొయేషియా గోల్ కీపర్ లివ్కోవిచ్ మళ్లీ తన జట్టుకు హీరో అని నిరూపించుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..