AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Enner Valencia: ఈ రోజు అతను అందరికీ హీరో.. కానీ ఒకప్పుడు గ్రౌండ్ మధ్యనుంచేే పోలీసులు..

అల్ బైత్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఖతార్‌ గ్రూప్‌-ఎలోని ఈక్వెడార్‌తో తలపడింది. అయితే తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆతిథ్య ఖతార్‌ను ఈక్వెడార్‌ జట్టు 2-0 తేడాతో ఓడించింది. తొలి సగభాగంలో

Enner Valencia: ఈ రోజు అతను అందరికీ హీరో.. కానీ ఒకప్పుడు గ్రౌండ్ మధ్యనుంచేే పోలీసులు..
Enner Valencia
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 21, 2022 | 7:10 AM

Share

ఖతార్‌‌లోని అల్ బైత్ స్టేడియం వేదికగా వేలాది మంది ప్రేక్షకులు, నిర్వాహకులు, ఫిఫా అధికారులు, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమల్ అల్ థానీ సమక్షంలో అంగరంగ వైభవంగా ఫిఫా ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ ఆదివారం ప్రారంభమయింది. టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగా దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ బీటీఎస్‌ ప్రేక్షకులను అలరించింది. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న ఫిఫా వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈక్వెడార్‌‌దే తొలి విజయం..

ఇక అల్ బైత్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఖతార్‌ గ్రూప్‌-ఎలోని ఈక్వెడార్‌తో తలపడింది. అయితే తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆతిథ్య ఖతార్‌ను ఈక్వెడార్‌ జట్టు 2-0 తేడాతో ఓడించింది. తొలి సగభాగంలో ఎన్నర్‌ వాలెన్సియా రెండు గోల్స్‌ కొట్టి ఈక్వెడార్‌ను ఆధిక్యంలో నిలిపాడు. 16వ నిమిషంలో అందివచ్చిన పెనాల్టీని ఉపయోగించుకొని గోల్‌ చేసిన వాలెన్సియా, అనంతరం 30వ నిమిషంలో ఏంజెలో ప్రిసియాడో అందించిన బంతిని తలతో అద్భుతంగా గోల్‌పోస్టులోకి నెట్టాడు. చివరి వరకు ఇదే ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న ఈక్వెడార్‌ ఫిఫా ప్రపంచకప్‌ తొలి విజయాన్ని తన వశం చేసుకుంది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఈక్వెడార్‌ 44వ స్థానంలో ఉండగా, ఖతార్‌ 50వ స్థానంలో ఉంది. టోర్నమెంట్‌ చరిత్రలోనే ఆతిథ్య జట్టు మొదటి మ్యాచ్‌లో ఓడడం ఇదే ప్రప్రథమం. అందరినీ అలరించే ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు జట్ల చొప్పున 8 గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ స్థాయిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రిక్వార్టర్స్‌కు చేరుతాయి.

ఇవి కూడా చదవండి

ఈ రోజు హీరో.. కానీ..

FIFA వరల్డ్ కప్-2022 లో ఈక్వెడార్ తమ జౌత్రయాత్రను ఆతిథ్య ఖతార్‌ను 2-0తో ఓడించడం ద్వారా ప్రారంభించింది. ఈ ప్రపంచంలోని మొదటి మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన ఈక్వెడార్ కెప్టెన్ ఎనర్ వాలెన్సియా హీరోగా నిలిచారు. పెనాల్టీలో వాలెన్సియా తొలి గోల్ చేయగా, రెండోది అద్భుతమైన హెడర్. దీంతో ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోయిన ఖతార్‌ ఈక్వెయిడర్ విజయానికి కూడా ఆతిథ్యమిచ్చినట్లయింది. వాలెన్సియా ఈ రోజు హీరో అయ్యాడు, కానీ పోలీసులు ఒకప్పుడు అతన్ని మిడిల్ గ్రౌండ్‌లోనే వెంటబడ్డారు. అదే క్రమంలో గాయపడిన వాలెన్సియాను  పోలీసులు తమ కారులో తీసుకెళ్లారు. అక్టోబర్ 7, 2016న ‘ది గార్డియన్‌’లో ప్రచురించబడిన కథనం ప్రకారం, ఈక్వెడార్, చిలీ మధ్య స్నేహపూరిత వాతావరణంలోనే మ్యాచ్ జరిగింది.. ఇందులో ఈక్వెడార్ 3-0తో చిలీపై గెలిచింది.

అందుకే పోలీసులు..

2018 ప్రపంచకప్‌లో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో వాలెన్సియా 82వ నిమిషంలో గాయపడ్డాడు. అతన్ని కారులో ఫుట్‌బాల్ పిచ్‌తో చేసిన ట్రాక్ నుంచి బయటకు తీసుకెళ్తుండగా, కొంతమంది పోలీసులు అతని వెంట పరుగెత్తడం కనిపించాడు. తన పిల్లల విషయంలో అతను బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడంటూ పలు కథనాలు వెలువడ్డాయి. అదే విషయంలో, ఓ స్పానిష్ వార్తాపత్రిక.. ఈక్వెడార్‌లో తన శిక్షణా సెషన్‌లో ఉన్న వాలెన్సియాను అదుపులోకి తీసుకోవడానికి న్యాయవాదులు పోలీసులతో వచ్చినట్లు రాసింది. వాలెన్సియా తన బిడ్డ ఖర్చులలో నిర్లక్ష్యంగా ఉన్నాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయితే, వాలెన్సియా తండ్రి బాధ్యతను సక్రమంగానే నిర్వర్తిస్తున్నాడిన అతని తరఫున లాయర్ తెలియజేశాడు.

ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ..

ఎనిమిదేళ్ల తర్వాత ఈక్వెడార్ జట్టు ఫిఫా ప్రపంచకప్‌కు తిరిగి వస్తోంది. 2018 ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకయిన ఈక్వెడర్.. 2014 ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశ నుంచే నిష్క్రమించింది. 2010లో కూడా ఈ జట్టు అర్హత సాధించలేకపోయింది. ఈ జట్టు ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొనడం ఇది నాలుగోసారి మాత్రమే. గతంలో 2002, 2006, 2014లో ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంటును ఈక్వెడర్ ఆడింది. అయితే 2006 టోర్నమెంట్‌లో ఈక్వెడర్ రౌండ్-16 వరకు వెళ్లింది. కాగా, మరే ఇతర ప్రపంచ కప్‌ టోర్నమెంటులలోనూ గ్రూప్ దశకు కూడా ఈక్వెడర్ చేరుకోలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..