ఐసీసీ వేటు.. జింబాబ్వే క్రికెట్ బోర్డు నిరసన

ఐసీసీ తమపై వేటు వేసిన నేపథ్యంలో జింబాబ్వే క్రికెట్ బోర్డు నిరసన వ్యక్తపరిచింది. దీంతో బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ క్రికెట్ జట్లతో కలిసి సెప్టెంబర్‌లో ఆడాల్సిన టీ20 ట్రై సిరీస్‌లో తమ ఆటగాళ్లు పాల్గొనబోరని జింబాబ్వే క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అంతేకాదు భవిష్యత్‌లోనూ జింబాబ్వే ఆడాల్సిన అన్ని రకాల టోర్నీలను రద్దు చేసుకున్నామని ఆ బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు ఐసీసీతో సఖ్యతగా వ్యవహరించి యథాతథంగా తమ కార్యకలాపాలను కొనగాలించాలనుకుంటామని.. ఎంత వీలైతే అంత త్వరగా తమ […]

ఐసీసీ వేటు.. జింబాబ్వే క్రికెట్ బోర్డు నిరసన
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 22, 2019 | 7:28 AM

ఐసీసీ తమపై వేటు వేసిన నేపథ్యంలో జింబాబ్వే క్రికెట్ బోర్డు నిరసన వ్యక్తపరిచింది. దీంతో బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ క్రికెట్ జట్లతో కలిసి సెప్టెంబర్‌లో ఆడాల్సిన టీ20 ట్రై సిరీస్‌లో తమ ఆటగాళ్లు పాల్గొనబోరని జింబాబ్వే క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అంతేకాదు భవిష్యత్‌లోనూ జింబాబ్వే ఆడాల్సిన అన్ని రకాల టోర్నీలను రద్దు చేసుకున్నామని ఆ బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు ఐసీసీతో సఖ్యతగా వ్యవహరించి యథాతథంగా తమ కార్యకలాపాలను కొనగాలించాలనుకుంటామని.. ఎంత వీలైతే అంత త్వరగా తమ ఆటగాళ్లు మళ్లీ క్రికెట్ ఆడితే చూడాలనుందని ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది.

అయితే జింబాబ్వే క్రికెట్ బోర్డు వ్యవహరాల్లో ప్రభుత్వం జోక్యం మితిమీరడంతో ఆ టీమ్‌పై ఐసీసీ వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో జింబాబ్వేకి చెందిన క్రికెట్ జట్లు ఏవీ.. ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనడానికి వీలు లేదు. మరోవైపు ఆ దేశానికి అందిస్తోన్న నిధుల సాయాన్ని కూడా ఐసీసీ పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఆ దేశానికి చెందిన ఆటగాళ్ల భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.