దేశంలోని ప్రతి ఇంటికి నువ్వు కూతురువమ్మ! : హిమ దాస్‌పై సాయి తేజ్ భావోద్వేగ ఫోస్ట్
ప్రపంచ దేశాల ముందు భారత జాతీయ జెండా అగ్రస్థానంలో నిలబడితే..గౌరవసూచకంగా అన్ని దేశాల ప్రతినిధులు, క్రీడాకారులు లేచి నిల్చుంటే..కొన్ని ఏళ్ల కళ నెరవేరితే..లైఫ్‌లో అంతకంటే బెస్ట్ మూమెంట్ ఏముంటుంది. అందుకే ఆ బావేద్వేగ క్షణాలు పతకం సాధించి..జాతీయగీతం ఆలపిస్తున్నప్పుడు ఆమె చెంపలు తడిగా మారాయి. సంతోషంతో, విజయ గర్వంతో వచ్చే కన్నీళ్లు చాలా గొప్పవి. వాటి రుచి తెలిస్తే మళ్లీ మళ్లీ ఆస్వాదించాలనిపిస్తుంది. ఆ దారిలోనే దూసుకుపోతుంది భారత ఏస్ స్ప్రింటర్ హిమ దాస్ . కేవలం […]
ప్రపంచ దేశాల ముందు భారత జాతీయ జెండా అగ్రస్థానంలో నిలబడితే..గౌరవసూచకంగా అన్ని దేశాల ప్రతినిధులు, క్రీడాకారులు లేచి నిల్చుంటే..కొన్ని ఏళ్ల కళ నెరవేరితే..లైఫ్‌లో అంతకంటే బెస్ట్ మూమెంట్ ఏముంటుంది. అందుకే ఆ బావేద్వేగ క్షణాలు పతకం సాధించి..జాతీయగీతం ఆలపిస్తున్నప్పుడు ఆమె చెంపలు తడిగా మారాయి. సంతోషంతో, విజయ గర్వంతో వచ్చే కన్నీళ్లు చాలా గొప్పవి. వాటి రుచి తెలిస్తే మళ్లీ మళ్లీ ఆస్వాదించాలనిపిస్తుంది. ఆ దారిలోనే దూసుకుపోతుంది భారత ఏస్ స్ప్రింటర్ హిమ దాస్ .
కేవలం 20 రోజుల్లో ఐదు బంగారు పతకాలు సాధించి దేశం గర్వించేలా సత్తా చాటింది. యూరప్‌లో ఈనెల 2న తొలి బంగార పతకాన్ని సాధించిన హిమ దాస్ అక్కడి నుంచి వరసపెట్టి ఐదు బంగారు పతకాలు గెలుచుకుంది. మొదటిగా జులై 2న పోలాండ్‌లో పొజ్నాన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో పాల్గొన్న హిమ దాస్ 200 మీటర్ల రేస్‌లో బంగారు పతాకం సాధించింది. ఆ తరవాత జులై 7న పోలాండ్‌లోనే కుట్నో అథ్లెటిక్స్ మీట్‌లో 200 మీటర్ల రేస్‌లో అగ్రస్థానంలో నిలిచి రెండో గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది.
జులై 13న చెక్ రిపబ్లిక్‌లో క్లాడ్నో అథ్లెటిక్స్ మీట్‌లో 200 మీటర్ల రేస్‌లో మూడో బంగారు పతాకాన్ని కైవసం చేసుకుంది. ఆ దేశంలోనే 17వ తేదీన జరిగిన టాబర్ అథ్లెటిక్స్ మీట్‌లో నాలుగో బంగారు పతకం సొంతం చేసుకుంది. అక్కడే జరిగిన 400 మీటర్ల రేస్‌లో అస్సాంకు చెందిన ఈ 19 ఏళ్ల రన్నర్ ఐదో గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది. ఇలా కేవలం 20 రోజుల్లోనే ఐదు బంగారు పతకాలు సాధించి దేశ ఖ్యాతిని చాటింది. ప్రస్తుతం హిమ దాస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశం మొత్తం ఆమె అద్భుత ప్రదర్శనకు దాసోహం అయ్యింది
హిమ దాస్ అగ్ర శ్రేణి ప్రదర్శనపై టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ స్పందించారు. తనను చూసి దేశ ప్రజలు గర్వపడుతున్నారని ట్వీట్ చేశారు. ‘నువ్వు ఇలాగే దూసుకుపో అమ్మాయి!!!! దేశంలో ఉన్న ప్రతి ఇంటికి ఇప్పుడు నువ్వు కూతురువి. 1.3 బిలియన్ల ప్రజలను గర్వపడేలా చేశావు హిమ దాస్’ అని తన ట్వీట్‌లో తేజూ పేర్కొన్నారు.
You go girl!!!!! ?????? you are now a daughter of every household in this country making 1.3billion of us proud #HimaDas #5thGold https://t.co/O7nhIyh16c
— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 21, 2019