AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న IPL మ్యాచ్‌ల లిస్ట్‌ ఇదే

ఐపీఎల్‌ నయా సీజన్‌ షురూ అవుతోంది. శుక్రవారం నుంచి క్రికెట్‌ మెగా టోర్నీప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులకు ఇక సందడే సందడి. రెండు నెలల పాటు కాలక్షేపానికి ఢోకా లేదు. గత ఏడాది మాదిరిగానే మొత్తం పది జట్లు బరిలోకి దిగుతున్నాయి. సన్‌రైజర్స్‌ యంగ్‌ టీమ్‌తో బరిలోకి దిగుతోంది. అద్భుతాలు చేయడానికి రెడీ అంటోంది.

Hyderabad: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న IPL మ్యాచ్‌ల లిస్ట్‌ ఇదే
Uppal Stadium
Ram Naramaneni
|

Updated on: Mar 21, 2024 | 11:12 AM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. పొట్టి క్రికెట్ సంబరం శుక్రవారం(మార్చి 22) నుంచి ప్రారంభం కానుంది. తొలి దశ టోర్నీ షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో కొన్ని మ్యాచ్‌లు జరగనున్నాయి. నగరంలో మ్యాచ్‌ల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు పోలీసులు ఇటీవల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మ్యాచ్‌లు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్ ప్రకారం నగరంలో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.  

  1. సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్
  2. సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్

తొలి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మార్చి 27న జరగనుంది. హైదరాబాద్,  చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఏప్రిల్ 5న రెండో మ్యాచ్ ఉంటుంది. హైదరాబాద్‌లోని రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపిఎల్ రెండవ దశను భారతదేశం నుండి తరలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో భాగంగా పలు ప్రాంచైజీలు తమ ఆటగాళ్ల పాస్‌పోర్ట్‌లను సేకరించాయి. అయితే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) వర్గాలు మాత్రం లీగ్ భారత్‌లో మాత్రమే జరుగుతుందని పేర్కొంది. లీగ్‌లో మొత్తం 10 జట్లు ఆడబోతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు హైదరాబాద్‌తో సహా వివిధ భారతీయ నగరాల్లో జరుగుతాయి.

బెట్టింగ్ బారిన పడొద్దు…

ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే.. చాలామంది బెట్టింగ్ వేసేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ అలవాడు మిమ్మల్ని నిలువునా నాశనం చేస్తుంది. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డున పడతారు. అందుకే బెట్టింగ్ జోలికి అస్సలు వెళ్లొద్దు. ఆటను ఆస్వాదించండి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..