సెలక్షన్ కమిటీపై విమర్శలు.. ఎమ్మెస్కే ప్రసాద్ గరంగరం

వరల్డ్ కప్ సెమీఫైనల్‌లోనే టీమిండియా నిష్క్రమించడంతో కోహ్లీ కెప్టెన్సీపై, సెలెక్షన్ కమిటీపై భారత క్రికెట్ మాజీలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్ వరకే కోహ్లీని కెప్టెన్‌గా అనుకున్నారని, కానీ, వెస్టిండీస్ పర్యటనకు కూడా అతడినే కెప్టెన్‌గా ఎంపిక చేశారని, జట్టును ఎంపిక చేసేముందు దీనిపై చర్చించి ఉండాల్సిందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ బహిరంగంగానే విమర్శించారు. ఇక, జట్టుకు సంబంధించిన విషయాల్లో కోహ్లీ, రవిశాస్త్రి ఆధిపత్యాన్ని ప్రశ్నించే దమ్ము, ధైర్యం సెలెక్షన్ కమిటీకి లేవనీ […]

సెలక్షన్ కమిటీపై విమర్శలు.. ఎమ్మెస్కే ప్రసాద్ గరంగరం
Follow us

|

Updated on: Jul 31, 2019 | 3:43 AM

వరల్డ్ కప్ సెమీఫైనల్‌లోనే టీమిండియా నిష్క్రమించడంతో కోహ్లీ కెప్టెన్సీపై, సెలెక్షన్ కమిటీపై భారత క్రికెట్ మాజీలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్ వరకే కోహ్లీని కెప్టెన్‌గా అనుకున్నారని, కానీ, వెస్టిండీస్ పర్యటనకు కూడా అతడినే కెప్టెన్‌గా ఎంపిక చేశారని, జట్టును ఎంపిక చేసేముందు దీనిపై చర్చించి ఉండాల్సిందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ బహిరంగంగానే విమర్శించారు. ఇక, జట్టుకు సంబంధించిన విషయాల్లో కోహ్లీ, రవిశాస్త్రి ఆధిపత్యాన్ని ప్రశ్నించే దమ్ము, ధైర్యం సెలెక్షన్ కమిటీకి లేవనీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదీకాక.. సెలెక్షన్ కమిటీలో ఉన్నవాళ్లందరు కలిసి కేవలం 13 టెస్టులే ఆడారని, వారికి క్రికెట్ అనుభవం అంతగా లేదని గంభీర్ లాంటి మాజీ ఆటగాళ్లు ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా సెలెక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పలు విషయాలు వెల్లడించారు.

అందరూ తమ అంతర్జాతీయ అనుభవం గురించి మాట్లాడుతున్నారని.. అనుభవమే కొలమానం అయితే, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎడ్ స్మిత్ తన కెరీర్‌‌లో ఒక్క టెస్టు మాత్రమే ఆడారని, ఆస్ట్రేలియా క్రికెట్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ట్రెవర్ హాన్స్ 13 ఏళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, ఆయన ఆడింది 7 టెస్టులు మాత్రమేనని ఎమ్మెస్కే చెప్పారు. 128 టెస్టులు, 244 వన్డేలు ఆడిన మార్క్‌వా, 87 టెస్టులు, 74 వన్డేలు ఆడిన గ్రెగ్ చాపెల్ వంటి వాళ్లు కూడా 7 టెస్టులాడిన ట్రెవర్ హాన్స్ కిందే పనిచేస్తున్నారని గుర్తు చేశారు. అందరికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి రాజ్ సింగ్ దుంగార్పూర్. ఆయన తన కెరీర్ లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా.. సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారని అన్నారు. ఆయన హయాంలోనే వజ్రం లాంటి క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ 16 ఏళ్లకే వెలుగు చూశాడని వివరించారు.

సెలక్షన్‌ కమిటీ మూడేళ్ల పనితీరును మీరెలా విశ్లేషిస్తారు? అని అడగ్గా..

మా కమిటీ దేశం నలుమూలలా తిరుగుతూ.. ఒక పద్ధతి ప్రకారం దేశవాళీ క్రికెట్లోని ప్రతిభావంతుల్ని గుర్తించి ఇండియా-ఎ, టీమ్‌ఇండియా జట్లకు ఎంపిక చేసింది. మూడేళ్లలో టీమ్‌ఇండియా 13 టెస్టు సిరీస్‌ల్లో 11 గెలిచి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. వన్డేల్లో 80-85 గెలుపు శాతముంది. ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓటమి వరకు టీమ్‌ఇండియా నంబర్‌వన్‌ స్థానంలో ఉంది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌ చేరుకుంది. 2016, 2018 ఆసియా కప్‌లలో విజేతగా నిలిచింది. ఆడిన 11 సిరీస్‌ల్లో ఇండియా-ఎ ఛాంపియన్‌ అయింది. 9 టెస్టు సిరీస్‌ల్లో ఎనిమిదింట్లో ఇండియా-ఎ నెగ్గింది. మూడు ఫార్మాట్లలో 35 మంది కొత్త ఆటగాళ్లను టీమ్‌ఇండియాకు ఎంపిక చేశాం. అన్ని విభాగాల్లో బలమైన రిజర్వ్‌ బెంచ్‌ను తయారు చేశాం. అత్యంత విజయవంతంగా పనిచేసినందుకు గర్వపడుతున్నాం. కొత్త సెలక్షన్‌ కమిటీకి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నాం.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..