టొరంటోలో గేల్‌ సుడిగాలి ఇన్నింగ్స్! కానీ మ్యాచ్ రద్దు!

గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో వెటరన్‌ క్రికెటర్లు వీరవిహారం చేస్తున్నారు. యూనివర్స్‌ బాస్‌, వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌గేల్‌ మంగళవారం పెను విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్.  వాంకోవర్‌ నైట్స్‌, మాంట్రియల్‌ టైగర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేవలం 54 బంతుల్లో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. అందులో 7 బౌండరీలు, 12 సిక్సర్లు బాదేశాడు. దీంతో వాంకోవర్‌ 276/3 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. టీ20ల్లో ఇది రెండో అత్యధిక […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:08 am, Wed, 31 July 19
టొరంటోలో గేల్‌ సుడిగాలి ఇన్నింగ్స్! కానీ మ్యాచ్ రద్దు!

గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో వెటరన్‌ క్రికెటర్లు వీరవిహారం చేస్తున్నారు. యూనివర్స్‌ బాస్‌, వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌గేల్‌ మంగళవారం పెను విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్.  వాంకోవర్‌ నైట్స్‌, మాంట్రియల్‌ టైగర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేవలం 54 బంతుల్లో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. అందులో 7 బౌండరీలు, 12 సిక్సర్లు బాదేశాడు. దీంతో వాంకోవర్‌ 276/3 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. టీ20ల్లో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. గేల్‌తో ఓపెనింగ్‌ చేసిన టోబాయిస్‌ 19 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దక్షిణాఫ్రికా ఆటగాడు రసి వాన్‌డెర్‌ డుసెన్‌ 26 బంతుల్లో 56 బాదేశాడు. అయితే వాంకోవర్‌ నైట్స్‌,  నైట్స్ నిర్దేశించిన లక్షాన్ని చేధించే అవకాశం మాత్రం దక్కలేదు . భారీ వర్షం రావడంతో మోంట్రియల్‌ టైగర్స్‌ బ్యాటింగ్ కి దిగలేదు .. దీనితో మ్యాచ్ రద్దు అయింది.