AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Sri Lanka 1st T20: నరాలు తెగే ఉత్కంఠ.. రిలీఫ్‌ ఇచ్చిన అక్షర్‌.. లంకపై టీమిండియా తొలి విజయం

ముంబై టీ20లో టీమిండియా విజయం సాధించింది. రెండు పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్‌ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 162/5, శ్రీలంక 160 అలౌట్‌ అయ్యింది...

India vs Sri Lanka 1st T20: నరాలు తెగే ఉత్కంఠ.. రిలీఫ్‌ ఇచ్చిన అక్షర్‌.. లంకపై టీమిండియా తొలి విజయం
India Vs Sri Lanka 1st T20
Subhash Goud
|

Updated on: Jan 03, 2023 | 11:03 PM

Share

ముంబై టీ20లో టీమిండియా విజయం సాధించింది. రెండు పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్‌ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 162/5, శ్రీలంక 160 అలౌట్‌ అయ్యింది. మూడు టీ20ల సిరీస్‌లో 1-0 భారత్‌ ఆధిక్యంలో ఉంది. ఉత్కంఠ పోరులో భారత్‌ ఘన విజయం సాధించింది. దీపక్‌ హుడా 41, అక్షర్‌ పటేల్‌ 31 (నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ 37, హార్థిక్‌ పాండ్యా 29 పరుగులు చేశారు. ఇక భారత్‌ బౌలర్‌ శివం నాలుగు వికెట్లను పడగొట్టాడు. అలాగే ఉమ్రాన్‌, అక్షర్‌ పటేల్‌లు రెండేసి వికెట్లు తీశారు. అలాగే శ్రీలంక బ్యాటింగ్‌ విషయానికొస్తే.. శనాక 45 పరుగులు, మెండిస్‌ 28, కరుణరత్నే 23 పరుగులు తీశారు.

అయితే భారత్ 2023 సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించింది. తొలి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా చివరి బంతికి 2 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఇక హుడా జట్టును విజయానికి చేరువకు తీసుకెళ్లినప్పటికి, మావి, అక్షర్ జట్టును విజయపథంలోకి తీసుకెళ్లారు. అరంగేట్రం మ్యాచ్‌లోనే 22 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. కాగా అక్షర్ వికెట్ పడకుండానే చేశాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక సరిగ్గా 20 ఓవర్లలోనే 160 పరుగులకు ఆలౌటైంది.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి