AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: 4 ఓవర్లలో 14 డాట్‌బాల్స్.. 4 వికెట్లతో అరంగేట్రంలోనే అదుర్స్‌ .. దెబ్బకు ఏడేళ్ల రికార్డులు బ్రేక్‌

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.శ్రీలంక జట్టు ధీటుగా పోరాడినప్పటికీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ థ్రిల్లింగ్‌ పోరులో అసలు హీరో కెరీర్‌ లో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న శివమ్‌ మావీనే.

IND vs SL: 4 ఓవర్లలో 14 డాట్‌బాల్స్.. 4 వికెట్లతో  అరంగేట్రంలోనే అదుర్స్‌ .. దెబ్బకు ఏడేళ్ల రికార్డులు బ్రేక్‌
Shivam Mavi
Basha Shek
|

Updated on: Jan 04, 2023 | 8:04 AM

Share

భారత క్రికెట్ జట్టు 2023 సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా రెండు పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.శ్రీలంక జట్టు ధీటుగా పోరాడినప్పటికీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ థ్రిల్లింగ్‌ పోరులో అసలు హీరో కెరీర్‌ లో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న శివమ్‌ మావీనే. మ్యాచ్‌ ఆద్యంతం అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ఈ కుర్ర బౌలర్‌ లంకేయుల పని పట్టాడు. ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే వికెట్లు తీసి పర్యాటక జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. ముందుగా పాతుమ్ నిస్సాంకాను అవుట్ చేసిన మావీ ఆ తర్వాత ధనంజయ్ డిసిల్వాను పెవిలియన్ పంపాడు. ఆతర్వాత క్రీజులో కుదురుకున్న ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ, మహేశ్‌ తీక్షణలను కూడా ఔట్‌ చేశాడు. మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్ల కోటా పూర్తి చేసిన మావి 22 రన్స్‌ ఇచ్చి 4 వికెట్ల పడగొట్టాడు. ఎకానమీ 5.5 మాత్రమే. టీమిండియా విజయంలో అతనిదే కీ రోల్.

ఏడేళ్ల రికార్డులు బ్రేక్‌..

ఈ మ్యాచ్‌ ద్వారా పలు రికార్డులు కొల్లగొట్టాడు శివమ్‌. 2009లో ప్రజ్ఞాన్ ఓజా బంగ్లాదేశ్‌పై అరంగేట్రం చేస్తూ 21 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 2016లో జింబాబ్వేపై అరంగేట్రం చేసిన బరీందర్ శరణ్‌ 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడీ రికార్డును సమం చేశాడు మావి. 2018లో పృథ్వీ షా కెప్టెన్సీలో న్యూజిలాండ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో మావి సభ్యుడు. అప్పటి నుంచి టీమిండియాలో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడీ యంగ్‌ బౌలర్‌. ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున అమోఘంగా రాణించాడు. కాగా మ్యాచ్ అనంతరం మావీ మాట్లాడుతూ.. ‘ ఈ క్షణం కోసమే ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నాను. కెరీర్‌ మధ్యలో నేను గాయాలపాలయ్యాను. దీంతో నా కల ఎప్పటికీ నెరవేరదని భావించాను. కానీ ఈ మ్యాచ్‌తో నాకల సాకారమైంది. నేను తీసిన తొలి వికెట్‌ నా ఫేవరెట్‌’ అని మురిసిపోయాడు మావి. కాగా అనారోగ్యంతో ఈ మ్యాచ్‌లో ఆడని అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో మావికి అవకాశం లభించింది. మావి ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు . ఈ సీజన్‌లో అతనిని పాండ్యా కెప్టెన్సీ గుజరాత్ టైటాన్స్ ఆరు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!