4 ఫోర్లు, 6 సిక్స్‌లు.. 23 బంతుల్లో ఊరమాస్ ఇన్నింగ్స్.. స్పెషల్ బ్యాట్‌తో బౌలర్లను చీల్చి చెండాడిన ప్లేయర్..
Big Bash League: మొదట్లో జోష్ క్రికెట్‌తో తన కెరీర్ ప్రారంభించలేదు. ఫుట్‌బాల్ ఆటతో కెరీర్ మొదలుపెట్టి, 13 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. 2019లో జోష్‌కి బ్రిటన్‌లో ఆడే అవకాశం వచ్చింది.

Josh Brown: బిగ్ బాష్ టీ20 లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ విజయంలో ఆస్ట్రేలియాకు చెందిన 29 ఏళ్ల జోష్ బ్రౌన్ హీరోగా నిలిచాడు. అతను 23 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 269.56 స్ట్రైక్ రేట్‌తో 62 పరుగులు చేశాడు. జోష్ రెండో వికెట్‌కు నాథన్ మెక్‌స్వానీ (84)తో కలిసి 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా బ్రౌన్ ఎంపికయ్యాడు. అయితే, మొదట్లో జోష్ క్రికెట్‌తో తన కెరీర్ ప్రారంభించలేదు. ఫుట్‌బాల్ ఆటతో కెరీర్ మొదలుపెట్టి, 13 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. 2019లో జోష్‌కి బ్రిటన్‌లో ఆడే అవకాశం వచ్చింది. ఒక ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేశాడు. మొత్తం సీజన్‌లో 1000+ పరుగులు చేసి 43 వికెట్లు తీశాడు.
జోష్ బ్రిస్బేన్‌లో 22 సంవత్సరాల వయస్సులో గ్రేడ్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అతను నార్తర్న్ సబర్బ్స్ క్లబ్‌కు అరంగేట్రం చేశాడు. 2020-21 సీజన్ జోష్ తన కెరీర్‌లో అద్భుతంగా నిలిచింది. అతను 53 మ్యాచ్‌లు ఆడాడు. 34.23 సగటుతో 1643 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 21 వికెట్లు తీశాడు. క్రికెట్‌తో పాటు బ్యాట్‌లు తయారు చేయడంలో నైపుణ్యం కూడా అతని సొంతం. ఇందుకోసం ఓ కోర్సు కూడా చేశాడు.
తన బ్యాట్‌తోపాటు, ఇతర ఆటగాళ్లకు కూడా బ్యాట్‌లను తయారు చేసి రిపేర్ చేస్తుంటాడు. ‘నాకు క్రికెట్ బ్యాట్‌ల తయారీ అంటే చాలా ఇష్టం. నేను ప్రతి సంవత్సరం 100 బ్యాట్‌లను తయారు చేస్తాను. 1000 బ్యాట్‌లను రిపేర్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. జోష్ ఫిషింగ్, గోల్ఫ్ ఆడటం ఆనందిస్తాడు.




బ్రిస్బేన్ హీట్‌లో సంచలన ఇన్నింగ్స్..
బ్రిస్బేన్ హీట్ ప్రస్తుత బీబీఎల్ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లలో రెండవ విజయాన్ని సాధించింది. బ్రిస్బేన్ హీట్ 15 పరుగుల తేడాతో సిడ్నీ సిక్సర్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 224/5 స్కోరు చేసింది. అనంతరం సిడ్నీ సిక్సర్స్ జట్టు 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి ఓడిపోయింది. జేమ్స్ విన్స్, జోర్డాన్ సిల్క్ తలో 41 పరుగులతో స్కోర్ చేశారు. మైకేల్ నేజర్ 3 వికెట్లు తీశాడు. 7 మ్యాచ్‌ల్లో సిడ్నీ సిక్సర్స్‌కు ఇది మూడో ఓటమి. వరుసగా 4 మ్యాచ్‌లు గెలిచిన ఆ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




