రేపట్నుంచే ఆసీస్‌-ఇండియాల పింక్‌ టెస్ట్ సమరం, అనుభవలేమే టీమిండియాకు ప్రతికూలం

ఎరుపో తెలుపో జానేదేవ్‌.. ఆ తేడాలిక్కడ లేనేలేవ్‌.. అంటూ క్రికెట్‌లో వేల కొద్దీ పరుగులు, వందలకొద్దీ వికెట్లు సాధించిన టీమిండియా ప్లేయర్లకు గులాబీరంగు బంతితో అసలు పరీక్ష ఎదురుకాబోతున్నది..

రేపట్నుంచే ఆసీస్‌-ఇండియాల పింక్‌ టెస్ట్ సమరం, అనుభవలేమే టీమిండియాకు ప్రతికూలం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 16, 2020 | 2:41 PM

ఎరుపో తెలుపో జానేదేవ్‌.. ఆ తేడాలిక్కడ లేనేలేవ్‌.. అంటూ క్రికెట్‌లో వేల కొద్దీ పరుగులు, వందలకొద్దీ వికెట్లు సాధించిన టీమిండియా ప్లేయర్లకు గులాబీరంగు బంతితో అసలు పరీక్ష ఎదురుకాబోతున్నది.. పింక్‌బాల్‌ టెస్ట్‌ల్లో భయంకరమైన అనుభవాన్ని గడించిన ఆస్ట్రేలియాతో విద్యుద్దీపాల వెలుగుల కింద కేవలం ఒకే ఒక్క టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన అనుభవం ఉన్న భారత్‌ తలపడబోతున్నది.. ఆస్ట్రేలియాకు పింక్‌బాల్‌తో ఏడు టెస్ట్‌లు ఆడిన అనుభవం ఉంటే, ఇండియాకు కేవలం ఒకే టెస్ట్‌ ఆడిన ఎక్స్‌పీరియన్స్‌ ఉంది.. అది కూడా స్వదేశంలో .. బలహీనమైన బంగ్లాదేశ్‌ జట్టుతో…! నిజానికి రెండేళ్ల కిందట ఆస్ట్రేలియాతో టీమిండియా పర్యటించినప్పుడే అడిలైడ్‌ గ్రౌండ్‌లో మొదటి టెస్ట్‌ను డే అండ్‌ నైట్‌లో పిక్‌బాల్‌తో ఆడదామంటూ ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఓ ప్రతిపాదన తెచ్చింది.. కానీ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు అందుకు అంగీకరించలేదు.. కారణం పెద్దగా అనుభవం లేకపోవడమే! అప్పటికే ఆసీస్‌ నాలుగు డే అండ్ నైట్ టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడింది.. ఇప్పుడేమైనా గొప్ప అనుభవాన్ని టీమిండియా గడించిందా అంటే లేదనే అనుకోవాలి.. అయినా సరే.. ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధపడింది.. డే అండ్‌ నైట్‌ వన్డేలు ఆడి గెలవంగా లేనిది, టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడలేమా అనుకుంటారు కానీ .. పింక్‌బాల్‌తో ఆడటం నిజంగానే చాలా కష్టం.. అయిదేళ్ల కిందట అంటే 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య ఇదే అడిలైడ్‌లో తొలి డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ జరిగింది..

నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ ఒకటి వరకు జరిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.. తదనంతరం ఇదే గ్రౌండ్‌లో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌, పాకిస్తాన్‌లు కూడా డే అండ్‌ నైట్ టెస్ట్‌లు ఆడాయి.. వాటిల్లో కూడా ఆసీస్‌దే పైచేయి అయ్యింది.. ఇక బ్రిస్బేన్‌, పెర్త్‌లలో కూడా ఒక్కో టెస్ట్‌ మ్యాచ్‌ జరిగింది.. ఆ మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియానే విజయం సాధించింది.. మొత్తం మీద ఆస్ట్రేలియాకు పింక్‌బాల్‌ మాబాగా కలిసొచ్చింది.. భారత్‌ కూడా ఓ డే అండ్‌ నైట్‌ టెస్ట్ మ్యాచ్‌ ఆడిందని చెప్పుకున్నాం కదా! ఆ మ్యాచ్‌లో ఇండియా ఆడింది ఎస్‌జీ బాల్‌తో.. కానీ ఆస్ట్రేలియాలో మాత్రం కూకాబుర్రా బాల్‌తో ఆడాలి.. మొన్నటి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా ఇదే బాల్‌తో ఆడి కొంచెం అనుభవాన్ని గడించింది.. లేకపోతే మరింత కష్టమయ్యేది.. రెడ్‌ బాల్‌తో పోలిస్తే కూకాబుర్రా పింక్‌ బాల్‌ చాలా డిఫరెంట్‌.. సాయంత్రం పింక్‌బాల్‌ విచిత్రంగా బిహేవ్‌ చేస్తుంది.. బాల్‌ స్పీడ్‌ అనూహ్యంగా పెరుగుతుంది.. స్వింగ్‌ కూడా బాగానే అవుతుంది.. అందుకే టీమిండియాకు ఇదో అగ్ని పరీక్ష! మన బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌ స్ట్రాంగ్‌గానే ఉన్నా.. పింక్‌బాల్‌ అనుభవజ్ఞులు ఆస్ట్రేలియాలోనే ఎక్కువగా ఉన్నారు.. ఏడు పింక్‌ టెస్ట్‌లు ఆడిన స్టార్క్‌ ఏకంగా 42 వికెట్లు తీసుకున్నాడు.. ఆరు మ్యాచ్‌లు ఆడిన హాజల్‌వుడ్‌ 28 వికెట్లు, నాలుగు మ్యాచ్‌లు ఆడిన కమిన్స్‌ 19 వికెట్లు తీసుకున్నారు..

ఈ ముగ్గురూ ఫస్ట్‌ టెస్ట్‌ కోసం రెడీగా ఉన్నారు.. ఇప్పటి వరకు అడిలైడ్‌లో జరిగిన డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ల్లో ఎక్కువ వికెట్లు పేస్‌ బౌలర్లకే వచ్చాయి.. అదే టీమిండియాకు ఊరటనిచ్చే అంశం.. స్పిన్‌ విషయానికి వస్తే ఆసీస్‌ బౌలర్‌ నాథన్‌ లయన్‌ తప్ప మిగతావారెవ్వరూ అంతగా రాణించలేదు.. అంచేత లయన్‌ బౌలింగ్‌లో టీమిండియా ప్లేయర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. నిజానికి వెదర్‌ కండిషన్స్‌ కూడా టీమిండియాను ఇబ్బంది పెట్టే ఛాన్స్‌ ఉంది.. డే అండ్‌ నైట్‌ టెస్ట్ అంటే పూర్తిగా విద్యుద్దీపాల వెలుగులో ఆడరు.. సాయంకాలం మ్యాచ్‌ మొదలవుతుంది.. అంటే కాసేపు సహజ వెలుతురులో మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది.. ఆ తర్వాత ఒక్కసారిగా ఫ్లడ్‌లైట్ల వెలుగులోకి వెళ్లాల్సి వస్తుంది.. అప్పటికే వాతావరణం చల్లబడుతుంది.. గాలి వేగంలో మార్పు వస్తుంది.. పింక్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో ఈ గంట సమయమే అత్యంత కీలకం.. ఈ టైమ్‌లోనే బ్యాట్స్‌మెన్‌ కాన్‌సంట్రేషన్‌ దెబ్బతింటుంది.. ఈ టైమ్‌లో ఎంత ఒపిగ్గా ఆడితే అంత మంచిది.. ఈ క్లిష్ట సమయాన్ని అధిగమిస్తే బ్యాట్స్‌మన్‌ ఈజీగా పరుగులు చేయవచ్చు.. ఇదే టెక్నిక్‌ను ఆసీస్‌ ఆటగాళ్లు అమలు చేస్తుంటారు.. చూద్దాం.. టీమిండియా ప్లేయర్లు ఏం చేస్తారో..!

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్