దేశం కోసం ఆడాలనేది నా కల.. అందుకే ఆ మధుర క్షణాలను ఎప్పటికి మరిచిపోలేనంటున్న క్రికెట్ లెజెండ్..

క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ ఆస్ట్రేలియా సిరీస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో విజయ అవకాశాలు

దేశం కోసం ఆడాలనేది నా కల.. అందుకే ఆ మధుర క్షణాలను ఎప్పటికి మరిచిపోలేనంటున్న క్రికెట్ లెజెండ్..
Follow us

|

Updated on: Dec 16, 2020 | 5:44 AM

క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ ఆస్ట్రేలియా సిరీస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో విజయ అవకాశాలు ఎక్కువగా ఆస్ట్రేలియాకే ఉన్నాయని పేర్కొన్నారు. ఎందుకంటే వారు స్వదేశంలో ఆడుతున్నారని, అక్కడి పరిస్థితులు వారికి అనుకూలంగా ఉంటాయని అన్నారు. అంతేకాకుండా ఆసీస్ ఎన్నో డే నైట్ మ్యాచ్‌లు ఆడిందని గుర్తుచేశారు.అందుకే ప్లడ్‌లైట్ల వెలుతురులో ఎలా ఆడాలో వారికి బాగా తెలుసన్నారు.

టీం ఇండియా బౌలర్లకు అక్కడి పిచ్‌లపై ఆడిన అనుభవం లేదు. బౌన్స్ బాగా లభిస్తుందని షార్ట్ బంతులు విసరడానికి ప్రయత్ని్స్తుంటారు కానీ ఫేస్ బలాల్ని అర్థం చేసకొని బౌలింగ్ చేయాలని సలహా ఇచ్చారు. టీం ఇండియాకు మంచి బౌలర్లు ఉన్నారు కానీ వారికి అక్కడి పరిస్థితులపై మంచి పట్టు ఉంది కనుక బౌలర్లు బలబలాలను అర్థం చేసుకొని బంతులు వేయాలని సూచించారు. ప్రపంచ కప్ అందుకున్న క్షణాల కంటే దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన తొలిరోజే తన జీవతంలో గొప్ప రోజని ప్రకటించారు. దేశం కోసం ఆడాలనేది తన కలని అందుకు ఆ మధుర క్షణాలను గుర్తుచేసుకొని మురిసిపోతానని తెలిపారు. కపిల్‌దేవ్ సారథ్యంలో 1983లో ఇండియాకు ప్రపంచకప్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.